Homeఎంటర్టైన్మెంట్Akhanda Pre Release: బాలయ్య చేతికి అలా కావడానికి నేనే కారణం- బోయపాటి

Akhanda Pre Release: బాలయ్య చేతికి అలా కావడానికి నేనే కారణం- బోయపాటి

Akhanda Pre Release: నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. డిసెంబరు 2న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా టీజర్​.. ట్రైలర్​, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా, ప్రమోషన్స్​లో భాగంగా హైదరాబాద్​లోని శిల్పకళావేదికపై గ్రాండ్​గా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించారు మేకర్స్​. ఈ వేడుకకు ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు రాజమౌళి కూడా వచ్చారు.

balayya

ఈ వేడుకలో దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ… జై బాలయ్య అని అభిమానులు ఇప్పుడు అంటున్ననారు కానీ, నేనైతో ఎప్పుడూ అనుకుంటాను.. అని అన్నారు. ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో తనకు తెలుసని.. దానికి ఉదాహరణే సింహా, లెజెండ్​ అని అన్నారు. ఇప్పుడు అఖండ కూడా అంతే గొప్పగా నచ్చుతుందని అన్నారు.

మరోవైపు, బాలయ్య చేతికి సర్జరీ కావడానికి నేనే కారణమని అన్నారు బోయపాటి. జై బాలయ్య సాంగ్​ షూట్​ రిహార్సిల్స్ సమయంలో కాలు జారి కింద పడిపోతూ.. ఎడమ భుజంతో ఆపేశారని.. కానీ, షూట్​ ఆపేద్దామని నేను అంటే.. పర్లేదు చేసేద్దామని బాలయ్య అన్నారని తెలిపారు బోయపాటి. అభిమానులకు మాస్ సాంగ్స్ లేకపోతే ఎలా అన్నారు. అది బాలయ్య అంటే.. నేను ఇప్పుడు డైరెక్టర్​గా నిలబడ్డానంటే.. దానికి కారణం బాలయ్య.. దానికి హెల్ప్ చేసింది మాత్రం బన్నీ.. వీరిద్దరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు బోయపాటి.  ఈ సినిమాతో పాటు వచ్చే ఏడాది రిలీజ్​ కానున్న ఆర్​ఆర్​ఆర్​, భీమ్లానాయక్​, ఆచార్య సినిమాలు కూడా మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు బోయపాటి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular