Homeఎంటర్టైన్మెంట్Skanda Vs Chandramukhi 2: బాక్సాఫీస్ వార్ : ఒకే రోజు రెండు సినిమాలు.. తెల్లవారితే...

Skanda Vs Chandramukhi 2: బాక్సాఫీస్ వార్ : ఒకే రోజు రెండు సినిమాలు.. తెల్లవారితే మరో సినిమా.. ఎవరిది హిట్ అవుతుంది?

Skanda Vs Chandramukhi 2: పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయంటే చిత్ర యూనిట్ కు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా సినిమాలు క్లాష్ అయితే చేసేదేం లేక విడుదల చేస్తారు కూడా.. అయితే కొన్ని సార్లు ప్రజలు థియేటర్లకు రాకపోవచ్చు అనే అనుమానం ఉంటే మరింత టెన్షన్ అవుతుంటుంది. అదేనండి ఇప్పడు ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి.. మరో వైపు అప్పుడే వినాయక నిమజ్జనం ఉంది. దీంతో ఆ మూడు సినిమాల పరిస్థితి ఏంటి అని అంతా ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంఓ వచ్చిన `స్కంద` సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ నెల రోజులే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఈ సినిమాను సెప్టెంబర్‌ 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారంగానే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు బాలయ్య రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. సెప్టెంబర్‌ 28న రావాల్సిన ప్రభాస్‌ `సలార్‌` వాయిదా పడటంతో ఆ డేట్‌కి పోస్ట్ పోన్‌ చేశారు.

ఈ సినిమానే కాదు తమిళంలో రూపొందిన `చంద్రముఖి 2` చిత్ర పరిస్థితి కూడా ఇదే. ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబర్‌ 15నే రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ టెక్నికల్‌గా ఎదురైన సమస్యలతో సినిమాని వాయిదా వేశారు. సెప్టెంబర్‌ 28కి వాయిదా వేశారు. `చంద్రముఖి`కి సీక్వెల్‌గా వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలున్నాయి. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ గురువారం విడుదల కాబోతుంది.

ఇప్పటికే స్కంద, చంద్రముఖి 2 సినిమాలు క్లాష్ అవుతాయేమో అని బాధ పడుతున్న సమయంలో మరో వార్త అభిమానులను కలచివేస్తుంది. ఒక్క రోజు గ్యాప్ తో ఏకంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన పెదకాపు 1 సినిమా కూడా రాబోతుంది. కొత్త హీరో నటిస్తున్న ఈ చిత్రాన్ని `అఖండ` నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. అయితే ఈ నెల 28నే కిరణ్‌ అబ్బవరం `రూల్స్ రంజన్‌`, ఎన్టీఆర్‌ బావమరిది నవీన్‌ నేర్ని నటించిన `మ్యాడ్‌` చిత్రాలు విడుదల కావాల్సింది. కానీ లేటెస్ట్ గా ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. అక్టోబర్‌ 6కి షిఫ్ట్ అయ్యాయి. కానీ మొత్తంత మీద ఈ మూడు సినిమాలు పెద్ద టెన్షన్ నే తెచ్చిపెట్టాయి చిత్రయూనిట్ కు అని టాక్ వినిపిస్తుంది.

మరో విషయం ఏంటంటే.. మూడు మీడియం రేంజ్‌ సినిమాలు కావడంతో థియేటర్లు ఈజీగానే పంచుకోవచ్చు. దీంతో రిలీజ్‌ విషయంలో సమస్య లేదు. కానీ అసలు సమస్య ఇప్పుడు ఎదురు కాబోతుంది. `సలార్‌` డేట్‌ దొరికిందని మురిసిపోయిన మేకర్స్ కి వినాయకుడి రూపంలో పెద్ద దెబ్బ పడబోతుంది. ఈ సినిమాల ఓపెనింగ్స్ పై గణేషుడు తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్ఞనం సెప్టెంబర్‌ 28ని నిర్ణయించారు. ఆల్మోస్ట్ అన్ని గణపతి విగ్రహాలు ఆ రోజు నిమజ్ఞనం అవుతాయి. అందుకోసం మార్నింగ్‌ నుంచి మండపాల వద్ద కోలహలం ఉంటుంది. యువత అంతా ఆయా కార్యక్రమాల్లోనే బిజీగా ఉంటారు. సినిమాని చూసేది మేజర్‌గా యూతే. వారే బిజీగా ఉంటే ఇక థియేటర్‌కి వచ్చేది ఎవరు? ఇక్కడే సినిమాలకు పెద్ద సమస్య రాబోతుంది. దీంతో ఈ నెల 28న రాబోతున్న స్కంద, చంద్రముఖి 2 చిత్రాలపై తీవ్ర ప్రభావం పడబోతుంది. ఇప్పుడు సినిమాలకు ఓపెనింగ్సే కీలకం. వాటికే కోత పడితే సినిమాకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అంతేకాదు ఆ ప్రభావం 29న కూడా ఉంటుంది. సినిమాని చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. దీంతో రెండో రోజు కూడా కలెక్షన్లకి గండి పడబోతుంది. దీంతో పెదకాపు చిత్రంపై కూడా వినాయకుడి నిమజ్ఞనం ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు అనుకున్నదొక్కటి, అవుతుందొక్కటి అన్నట్టుగా మారిపోయింది నిర్మాతల పరిస్థితి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular