Box Office: కరోనా మొదలైన దగ్గర నుంచి ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చాయి. పైగా నష్టాల్లో ఉన్న నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టాయి. పైగా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, అప్ డేట్ అవుతూ.. కొత్త కంటెంట్ తో పాటు ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో కొన్నిసినిమాలు థియేటర్ లోనే రిలీజ్ కావడానికి సిద్ధం అయ్యాయి. మరి ఈ వారం థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు పై ఓ లుక్కేద్దాం. హీరో శర్వానంద్ హీరోగా మాజీ లవర్ బాయ్ సిద్ధార్థ్ విలన్ గా వస్తోన్న సినిమా ‘మహా సముద్రం’. దర్శకడు అజయ్ భూపతి దర్శకత్వంలో అదితీ రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా రాబోతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్ లో విడుదల కానుంది.
ఈ సినిమా పై బాగానే అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా అవుట్ ఫుట్ పై ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి. అలాగే అక్కినేని అఖిల్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా వస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అక్టోబర్ 15న దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదలవుతుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడిగా ఈ సినిమా రానుంది.
అయితే, ఈ సినిమాకి కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాకపోతే అఖిల్ నటించిన గత మూడు చిత్రాలు హిట్ రాలేదు. మరి ఈ సినిమాతో అఖిల్ కి హిట్ వస్తోందా ?. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వస్తోన్న సినిమా ‘పెళ్ళిసంద D’. గౌరి రోనంకి తెరకెక్కించిన ఈ సినిమా పై ఎవరికీ ఎలాంటి నమ్మకం లేదు. కానీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ కావడం,
అదే విధంగా ఎమ్‌ఎమ్ కీరవాణి స్వరాలను సమకుర్చడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. ఈ చిత్రం కూడా అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ప్లాప్ ల వలయంలో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపి కొత్త ఆశలు రేకెత్తిచ్చే దిశగా ఈ సినిమాలు సాగుతాయా ?