https://oktelugu.com/

Samanyudu: బాక్సాఫీస్ – ఆకట్టుకోవడంలో ‘సామాన్యుడు’ ఫెయిలయ్యాడు

Samanyudu: మూడో వేవ్‌ నడుస్తుండడంతో గత రెండు వారాల నుంచి పెద్దగా పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ రాలేదు. అయితే, ఈ శుక్రవారం విశాల్ నటించిన సామాన్యుడు కాస్త పెద్ద సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తర్వాత ఈ సినిమా హిట్ సినిమాగా నిలిచింది అని టాక్ వినిపించింది. అయితే, ఈవెనింగ్ షోలు వచ్చే సరికి, ఈ సామాన్యుడు నిజంగానే సామాన్యుడు అనిపించాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిన్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2022 / 12:48 PM IST
    Follow us on

    Samanyudu: మూడో వేవ్‌ నడుస్తుండడంతో గత రెండు వారాల నుంచి పెద్దగా పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ రాలేదు. అయితే, ఈ శుక్రవారం విశాల్ నటించిన సామాన్యుడు కాస్త పెద్ద సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తర్వాత ఈ సినిమా హిట్ సినిమాగా నిలిచింది అని టాక్ వినిపించింది.

    Samanyudu

    అయితే, ఈవెనింగ్ షోలు వచ్చే సరికి, ఈ సామాన్యుడు నిజంగానే సామాన్యుడు అనిపించాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిన్న మొన్న రెండు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ డల్ గా ఉన్న ఈ సినిమా ఈ రోజు కూడా డల్ గా మొదలైంది.

    Also Read:  ఉద్యోగుల డిమండ్లు నెర‌వేరుస్తారా? ఎస్మా ప్ర‌యోగిస్తారా?

    మరి ఈ సినిమాకి వీకెండ్ కలెక్షన్స్ పుంజుకోకపోతే మేకర్స్ భారీగానే నష్టపోతారు. పరిస్థితి చూస్తుంటే మాత్రం.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర లాభాల్లోకి వెళ్లడం కష్టమే అనిపిస్తుంది. మొత్తానికి విశాల్ కి సామాన్యుడు ఏ మాత్రం లాభం చేకూర్చలేకపోయాడు. తమిళ స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్… తమిళంలో మాత్రం తన సినిమాకు మంచి కలెక్షన్స్ నే రాబట్టాడు.

    Samanyudu

    ఇక ఈ సినిమాలో విశాల్ కి డింపుల్ హయతి జంటగా నటించింది. అయితే, విశాల్‌ తన సొంత బ్యానర్‌ ‘విశాల్ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ’పై ఈ సినిమాని నిర్మించాడు. పైగా తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదల చేశాడు. మొత్తానికి విశాల్ కి తెలుగులో ఈ సినిమాతో భారీ నష్టాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయినా ఈ మధ్య విశాల్ హీరోగా చేసిన సినిమాలు ఏవీ పెద్దగా సక్సెస్ కావడం లేదు.

    Also Read: నల్ల ఉప్పు కలిపిన నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

    Tags