Homeఎంటర్టైన్మెంట్Box Office: ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల పై గ్రౌండ్...

Box Office: ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల పై గ్రౌండ్ రిపోర్ట్ !

Box Office: Ground Report on This Week Movies

Box Office: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అనంతరం తెలుగు బాక్సాఫీస్ (Box Office) వద్ద ప్రస్తుతం వరుస సినిమాల హడావుడి కొనసాగుతోంది. మరీ ఈ వారం అలరించబోతున్న సినిమాల బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటో చూద్దాం.

‘గల్లీ రౌడీ’ :

సందీప్‌ కిషన్‌ హీరోగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘గల్లీ రౌడీ’. ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబరు 17న థియేటర్‌లలో రిలీజ్ కాబోతుంది. మెగాస్టార్ రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌ బాగానే ఆకట్టుకుంది. కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ సినిమాకి పెద్దగా పోటీ కూడా లేదు కాబట్టి.. ఈ సినిమాకి లాభాలు వచ్చే స్కోప్ కనిపిస్తోంది.

‘విజయ రాఘవన్‌’ :

విజయ్‌ ఆంటోని హీరోగా ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కూడా సెప్టెంబరు 17న థియేటర్‌లలో రిలీజ్ కాబోతుంది. టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా పై పెద్దగా అంచనాలు లేవు. ఎలాగూ ప్రమోషన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి.. ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడం కష్టమే.

‘ఫ్రెండ్‌షిప్’

క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, నటుడు అర్జున్‌ కథానాయకులు నటించిన సినిమా ‘ఫ్రెండ్‌షిప్’. ఈ సినిమా సెప్టెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. కానీ ఎక్కడా ఎలాంటి అంచనాలు లేవు.

‘జెమ్‌’

విజయ్‌ రాజా, రాశీ సింగ్‌, నక్షత్ర నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘జెమ్‌’. ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి పోస్టర్ ఖర్చులకు కూడా కలెక్షన్స్ వచ్చేలా లేవు.

‘ప్లాన్‌ బి’ :

శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పాత్రధారిగా కె.వి.రాజమహి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్లాన్‌ బి’. ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే.

‘హనీ ట్రాప్‌’ :

‘హనీ ట్రాప్‌’ అంటూ వివి వామనరావు కీలక పాత్రలో నటిస్తూ.. స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పరిస్థితి కూడా అదోగతే. మొత్తానికి ఈ వారం సినిమాల పరిస్థితి కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version