Bigg Boss 5 Telugu:
బిగ్ బాస్ హౌస్ లో అత్యంత కీలకమైన ఘట్టం నామినేషన్ ప్రక్రియ. అలాంటి నామినేషన్ ప్రక్రియ 2 వ వారానికి చేరుకుంది. మొదటి వారం తో పోలిస్తే ఈ సారి నామినేషన్స్ చాలా వాడి వేడిగా మరియు రసవత్తరం గా సాగబోతున్నాయని అనిపిస్తుంది.
శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున పరోక్షం గా ఒక హింట్ ఇచ్చారు. గొడవలు పడుతుంటే నే చాలా బాగుంది ఉమ అని. నార్మల్ గానే హౌస్ మేట్స్ గొడవలతో రెచ్చిపోయి ఒక రేంజ్ లో TRP రేటింగ్స్ పెంచుతుంటే నాగార్జున హింట్ ఇచ్చాక హౌస్ మేట్స్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ని ఇస్తారో …. ఒక్కోక్కరు ఎంత స్క్రీన్ స్పేస్ ఆక్రమిస్తారో చూడాలి.
మొదటి వారం లో ఆరుగురు ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన సంగతి తెల్సిందే. ఈ సారి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయ్యే కంటెస్టెంట్స్ సంఖ్య పెరుగుతుందని ఒక అంచనా.
ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో మొదటి వారం నామినేట్ అయిన 6 మంది ఇంటి సభ్యులు నుండి సరయు ఎలిమినేట్ అయ్యింది.
తాజా అప్ డేట్స్ ప్రకారం ఈ సారి నామినేషన్స్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా జరగబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 18 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. ఈ సారి నామినేషన్స్ ప్రక్రియ లో హౌస్ మేట్స్ రెండు గ్రూపులుగా గా విడిపోయి నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఆ రెండు గ్రూపుల నుండి ఈ సారి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉమ, ఆర్ .జే కాజల్,
ఆని మాస్టర్, ప్రియాంక సింగ్, లోబో, నటరాజ్ మాస్టర్ మరియు ఆర్టిస్ట్ ప్రియ అని తెలుస్తుంది.
ఇంకా 2 వ వారం బిగ్ బాస్ హౌస్ చాలా ఆసక్తికరం గా మారనుంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మళ్లీ ఫీమేల్ కంటెస్టెంట్ వెళ్లనున్నారా….! ఇప్పటికే మొదటి వారం ఫీమేల్ కంటెస్టెంట్ సరయు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ రెండవ వారం కూడా ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే మేల్ కంటెస్టెంట్స్ ఆధిక్యత ఎక్కువ అవుతుంది.