Atithi Devobhava: ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్ గా వచ్చిన ‘అతిధి దేవోభవ’ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద క్లోజ్ అయ్యాయి. కలెక్షన్స్ ఎలా వచ్చాయి అని అడగడం వేస్ట్. ఎందుకంటే. చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్టు ఉంది పరిస్థితి. అసలు ఈ ‘అతిథి దేవో భవ’కి రూ.1.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా వరల్డ్ వైడ్ గా 0.24 కోట్లును మాత్రమే. బయ్యర్లు ఈ సినిమా దెబ్బకు ఫుల్ గా లాస్ అయ్యారు. నిర్మాతలు కూడా ఈ సినిమాతో భారీగానే నష్టపోయారని వేరే చెప్పక్కర్లేదు. పొలిమేర నాగేశ్వర్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి విపరీతమైన డిజాస్టర్ టాక్ తో కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది.

ఇక ఈ అతి పెద్ద డిజాస్టర్ కి వచ్చిన ఫస్ట్ వీక్ కలెక్షన్లను చూద్దాం.
ఆంధ్రా : 0.07 కోట్లు
నైజాం : 0.10 కోట్లు
సీడెడ్ : 0.06 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 0.23 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.01 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.24 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
Also Read: నారా లోకేష్ ను వదిలిపెట్టని కరోనా
అసలు మొదటి షో నుంచి అతి దారుణంగా వచ్చాయి ఓపెనింగ్స్. కొన్ని థియేటర్స్ లో అయితే సింగిల్ టికెట్ కూడా తెగ లేదని టాక్ వచ్చింది. అసలు ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో ప్లాప్ అయిన సినిమా మరొకటి లేదట. ఆ స్థాయిలో బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా ఫుల్ క్రెడిట్ ను కొట్టేసింది ఈ ‘అతిధి దేవోభవ’ చిత్రం. ఆది సాయి కుమార్ ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నా.. కనీసం ప్లాప్ టాక్ కూడా రాలేదు. ఈ సినిమా రిజల్ట్ తో ఆది బాగా నిరాశ చెందాడు. మిర్యాల రాజాబాబు, అశోక్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. అసలు ఊరు పేరు లేని హీరోకి కూడా మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. అలాంటిది ఆది సాయి కుమార్ కి మాత్రం అస్సలు కలెక్షన్స్ రాకపోవడం నిజంగా విచిత్రమే.
Also Read: మహేష్ తో సాయి పల్లవి.. త్రివిక్రమ్ కూడా థ్రిల్ ఫీల్ అయ్యాడు !
[…] Hero: ఈ సంక్రాంతికి పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు ‘అశోక్ గల్లా’ హీరోగా పరిచయం అయ్యాడు అంటూ ఓ రేంజ్ లో హడావిడి చేశారు. ఎంతైనా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా అలాగే, హీరో మహేష్ బాబు మేనల్లుడిగా అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘హీరో’ అనే పేరుతో అశోక్ గల్లా హీరోగా రూపొందిన ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందింది. అయితే, సినిమా ప్రమోషన్స్ లో చూపించిన హడావుడి.. సినిమాలో మాత్రం కనిపించలేదు. ఫస్ట్ డే నుంచి ఈ సినిమాకు కలెక్షన్స్ చాలా వీక్ గానే ఉన్నాయి. […]