Hrithik Roshan New Movie : బాలీవుడ్ హీరోలలో మన సౌత్ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే వారిలో ఒకరు హృతిక్ రోషన్(Hrithik Roshan). ఆయన సరిగా మన సౌత్ మార్కెట్ పై ఫోకస్ పెట్టలేదు కానీ, పెట్టి ఉంటే మాత్రం హృతిక్ రోషన్ నేడు ఇండియా లోనే ఎవ్వరూ అందుకోలేనంత బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ లో ఉండేవాడని పలువురి విశ్లేషకుల అభిప్రాయం. ఆయన నటించిన క్రిష్ సిరీస్, ధూమ్ 2 చిత్రాలు మన తెలుగు లో కూడా దుమ్ము లేపాయి. అయితే ఆలస్యంగా అయినా హృతిక్ రోషన్ ఇప్పుడిప్పుడే సౌత్ మార్కెట్ పై ద్రుష్టి పెడుతున్నాడు. అందులో భాగంగానే ఆయన ఎన్టీఆర్(Junior NTR) తో కలిసి ‘వార్ 2′(War 2 Movie) చిత్రం లో నటించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సౌత్ లో ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ ఉండడంతో ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ కి కూడా మంచి రీచ్ వస్తుంది.
Also Read : అప్పుడే పూర్తి అయ్యిందా..మెగాస్టార్ కి ఊహించని ఝలక్ ఇచ్చిన అనిల్ రావిపూడి!
ఇక ఈ సినిమా తర్వాత ఆయన ‘క్రిష్ 4’ చేయబోతున్నాడు. ఈ సిరీస్ కి మొదటి నుండి మన సౌత్ మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, ఈ చిత్రం తో ఆయన సౌత్ బేస్మెంట్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన KGF మేకర్స్ ‘హోమబుల్ ఫిలిమ్స్'(Hombale Movies) తో ఒక సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. రీసెంట్ గానే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆ సంస్థ గ్రాండ్ గా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. హోమబుల్ ఫిలిమ్స్ అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రశాంత్ నీల్. ఈ సంస్థ పాన్ ఇండియన్ సినిమాలు ప్రకటించిందంటే దానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా ఉంటాడేమో అని ఆడియన్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు.
కానీ అందరూ అనుకుంటున్నట్టుగా ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాదట, ప్రముఖ మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) అట. రీసెంట్ గానే హృతిక్ రోషన్ ని పృథ్వీ రాజ్ సుకుమారన్, హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ అధినేతలు కలిసి ఈ స్టోరీ ని వినిపించారట. పృథ్వీ రాజ్ న్యారేషన్ హృతిక్ కి చాలా బాగా నచ్చింది. ఇది వరకు పృథ్వీరాజ్ మోహన్ లాల్ తో ‘లూసీఫర్’,’L2: ఎంపురాన్ ‘ వంటి చిత్రాలు తీసాడు. ఈ రెండు కమర్షియల్ గా ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డైరెక్టర్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ కి ఎంతో మంచి పేరొచ్చింది. మళ్ళీ ఆయన హృతిక్ రోషన్ కోసం మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మరోసారి తన టాలెంట్ ని నిరూపించుకోబోతున్నాడు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవ్వగానే హృతిక్ రోషన్ చిత్రానికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.