https://oktelugu.com/

Toxic: స్టార్ హీరోతో షారుక్ ఖాన్.. మరో భారీ మల్టీస్టారర్.. అదిరిపోయే కాంబో

పఠాన్ తర్వాత జవాన్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు షారుఖ్. కోలివుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీ సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పుడు బాద్ షా నెక్స్ట్ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 6, 2024 / 12:47 PM IST
    Follow us on

    Toxic: షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య ఈయన రేంజ్ మరింత పెరిగింది. బాలీవుడ్ బాద్ షా గా పేరు సంపాదించిన ఈ స్టార్ హీరో ఈ మధ్య ఊహించని రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సంపాదించారు. ఇక ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నారు. కొన్ని రోజులు సైలెంట్ అయినా షారుఖ్.. గతేడాది పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు షారుఖ్ ఖాన్. అంతేకాదు పఠాన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

    ఇక పఠాన్ తర్వాత జవాన్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు షారుఖ్. కోలివుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీ సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పుడు బాద్ షా నెక్స్ట్ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు? డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు షారుఖ్ తదుపరి చిత్రానికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

    కేజీఎఫ్1,2 సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ అందుకున్న యష్ సినిమాలో మెరవబోతున్నారట షారుఖ్. ఇక యష్ చాలా కాలం తర్వాత రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. అందులో ఒకటి టాక్సిక్. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో మొదలు కానుంది. ఈ సినిమాకు మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో అతిథి పాత్రలో షారుఖ్ ఖాన్ కనిపించనున్నారట. ఇప్పటికే మేకర్స్ షారుఖ్ ను సంప్రదించారని తెలుస్తోంది. కానీ దీన్ని అధికారికంగా బాద్ షా ఎప్పుడు ప్రకటిస్తారనేది తెలియాల్సి ఉంది.

    ఒకవేళ షారుఖ్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే.. సౌత్ ఇండస్ట్రీలో ఇదే భారీ మల్టీస్టారర్ కానుంది. అంతేకాదు షారుఖ్ నటించనున్న మొదటి సౌత్ మల్టీస్టారర్ కూడా ఇదే. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు ఇంకా తెలియదు. కాబట్టి ఆ వివరాల కోసం కూడా ఎదురుచూస్తున్నారు యష్, బాద్ షా అభిమానులు.