https://oktelugu.com/

ముదురు భామ ప్రేమ కోసం అప్పులపాలైన ‘యంగ్ హీరో’ !

బాలీవుడ్ ముదురు హీరోయిన్ ‘మలైకా అరోరా’ కుర్ర హీరో అర్జున్ కపూర్ తో కొనసాగిస్తోన్న ఘాటు ప్రేమ గురించి, వారి బరి తెగింపు రొమాన్స్ గురించి ఇప్పటికే రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఈ జంట గురించి తాజాగా మరో అప్ డేట్ తెలిసింది. అర్జున్‌ కపూర్‌ మలైకా ఎడబాటును అస్సలు భరించలేకపోతున్నాడని, అందుకే మలైకా ఇంటికి సమీపంలోని ఓ ఖరీదైన విల్లా కొనుగోలు చేశాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ ఇల్లు […]

Written By:
  • admin
  • , Updated On : May 30, 2021 / 05:32 PM IST
    Follow us on

    బాలీవుడ్ ముదురు హీరోయిన్ ‘మలైకా అరోరా’ కుర్ర హీరో అర్జున్ కపూర్ తో కొనసాగిస్తోన్న ఘాటు ప్రేమ గురించి, వారి బరి తెగింపు రొమాన్స్ గురించి ఇప్పటికే రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఈ జంట గురించి తాజాగా మరో అప్ డేట్ తెలిసింది. అర్జున్‌ కపూర్‌ మలైకా ఎడబాటును అస్సలు భరించలేకపోతున్నాడని, అందుకే మలైకా ఇంటికి సమీపంలోని ఓ ఖరీదైన విల్లా కొనుగోలు చేశాడు.

    అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ ఇల్లు కోసం అర్జున్ కపూర్ అప్పు చేశాడు. బాలీవుడ్ సెలబ్రిటీల నివాసాలకు నిలయమైన ముంబైలోని బాంద్రాలో అర్జున్‌ ఈ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశాడు. ఒకపక్క బోనీకపూర్ అప్పులపాలు అయిపోయి కూతురు జాన్వీ కపూర్ సంపాదన పై బండి లాక్కోస్తున్నాడు. ఇలాంటి టైంలో తండ్రికి సపోర్ట్ గా నిలవాల్సింది పోయి, తన ఘాటు ప్రేమ కోసం ఇలా మళ్ళీ అప్పులు చేసాడు.

    ఈ స్కై విల్లా కోసం దాదాపు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ‘మలైకా అరోరా’ అర్జున్ కపూర్ కోసం తన మాజీ భర్త ‘సల్మాన్ తమ్ముడి’కి హ్యాండ్ ఇచ్చి, అర్జున్ కపూర్ ను పెళ్లి చేసుకోవడానికి రెండేళ్ళ క్రితమే సన్నాహాలు చేసుకున్నా కొన్ని కారణాల వల్ల, ఆ పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుంది. ఈ ఏడాది సమ్మర్ లో మళ్ళీ పెళ్లి ప్లాన్ చేసుకుంది.

    అంతలో కరోనా సెకెండ్ వేవ్ వచ్చింది. దాంతో తమ పెళ్లిని అప్పుడు రద్దు చేసుకున్నారు ఈ జంట. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పట్లో తమ పెళ్లిను ప్లాన్ చేసుకునే ఆలోచనలో తాము లేము అని మలైకా చెప్పుకొచ్చింది. అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోకపోతే ఏమి, ప్రస్తుతం ఈ జంట ఒకే ఇంట్లో భార్యాభర్తలు లాగానే కలిసి ఉండటానికి రంగం సిద్ధం చేసుకుంది.