https://oktelugu.com/

Alia Bhatt And Ranbir: అలియా భట్ రన్బీర్ కపూర్ మధ్య ఏం జరుగుతుంది..?

అలియా భట్ కూడా పాప చిన్నది అవడంతో ఇప్పటివరకు తను వేరే సినిమాలు కూడా ఏవి ఒప్పుకోకుండా పాప సంరక్షణ చూసుకుంటూ ముందుకు సాగుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 11, 2024 / 08:10 AM IST

    Alia Bhatt And Ranbir

    Follow us on

    Alia Bhatt And Ranbir: బాలీవుడ్ ఇండస్ట్రీలో రన్బీర్ కపూర్ అలియా భట్ లా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీళ్ళిద్దరూ కూడా హీరో హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక వీళ్లకు ఇప్పుడు ‘రాహో ‘ అనే పాప కూడా జన్మించింది. ఇక రన్బీర్ కపూర్ షూటింగ్ ఉన్న రోజు షూటింగ్లో ఉంటున్నాడు. షూటింగ్ లేకపోతే ఇంట్లో రాహో తో కలిసి ఆడుకుంటున్నాడు.

    అంతే తప్ప బయట ఎక్కడ కూడా ఎక్కువగా కనిపించడం లేదు. అలాగే అలియా భట్ కూడా పాప చిన్నది అవడంతో ఇప్పటివరకు తను వేరే సినిమాలు కూడా ఏవి ఒప్పుకోకుండా పాప సంరక్షణ చూసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఇలాంటి క్రమం లోనే రన్బీర్ కపూర్ అలియా భట్ ఇద్దరు కూడా చాలా చక్కటి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సమయం లో బాలీవుడ్ లోని కొన్ని మీడియా సంస్థలు మాత్రం రన్బీర్ కపూర్ ఆలియా భట్ లా మధ్య దూరం పెరుగుతుందని కొన్ని వార్తలైతే రాస్తున్నారు.

    ఇక దానికి కూడా కారణం ఏంటి అంటే గత సంవత్సరం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి డిమ్రి దీనికి కారణం అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఇక నిజానికి త్రిప్తి డిమ్రి రన్బీర్ కపూర్ కి మధ్య ఎలాంటి సంబంధమైతే లేదు. ఇక అనిమల్ సినిమాలో వీళ్ళిద్దరూ కొంచెం బోల్డ్ సీన్స్ లో నటించడం వల్ల ఆలాంటి వార్తలైతే వస్తున్నాయి.

    ఇక రీసెంట్ గా ఆమె ముంబైలోని బాంద్రాలో 14 కోట్లు పెట్టి రెండు అంతస్తుల ఇల్లును కొనుగోలు చేసింది. ఇక దాంతో ఆమె ఆ ఇల్లు కొనుగోలు చేయడం వెనక రన్బీర్ కపూర్ ఉన్నారంటూ చాలా వార్తలైతే వచ్చాయి. వాటి వేటికి కూడా సరైన ఆధారం అయితే కనిపించడం లేదు. కానీ వీళ్ళు అనిమల్ సినిమాలో కలిసి చేయడం వల్లే వీళ్ల మీద అలాంటి రూమర్స్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది…