Gold Price Today: నిన్నటి వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు బంగారం దాదాపు రూ.2000 వరకు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే.. స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2,308 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 29.54 డాలర్లు పలికింది. దేశీయంగా మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 11న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.71,670 గా ఉంది. జూన్ 10న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,700తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోలిస్తే మంగళవారం ధరలో ఎటువంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.71,820గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.71,670 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.65,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,670తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,670తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు స్థిరంగా కొనసాగినా వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.96,200గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.200 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.91,800గా ఉంది. ముంబైలో రూ.91,800, చెన్నైలో రూ.96,300 బెంగుళూరులో 90,300, హైదరాబాద్ లో రూ. 96,300 తో విక్రయిస్తున్నారు.