https://oktelugu.com/

Ranveer Singh: కల్కి సినిమాపై దీపిక భర్త రణ్ వీర్ షాకింగ్ కామెంట్స్

తాజాగా దీపికా పదుకొనె భర్త బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఈ సినిమా మీద కామెంట్లు చేశారు. తన భార్య దీపికను మాత్రమే కాదు టోటల్ టీమ్ ను కొనియాడారు రణవీర్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 3, 2024 / 05:15 PM IST

    Ranveer Singh

    Follow us on

    Ranveer Singh: ప్రభాస్ కల్కి ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాన్ ఇండియా మూవీ భారీ హిట్ దిశగా దూసుకొని పోతుంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూల్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకోవడం పక్కా అంటున్నారు ప్రభాస్ అభిమానులు. దీంతో నాగ్ అశ్విన్ ను అభినందిస్తున్నారు నెటిజన్లు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరి ప్రశంసలు అందుకుంటుంది సినిమా.

    తాజాగా దీపికా పదుకొనె భర్త బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఈ సినిమా మీద కామెంట్లు చేశారు. తన భార్య దీపికను మాత్రమే కాదు టోటల్ టీమ్ ను కొనియాడారు రణవీర్. ఇన్ స్టాగ్రామ్ లో కల్కి పోస్టర్ ను షేర్ చేసి ఇందులోని తారాగణాన్ని విడివిడిగా కొనియాడారు. “కల్కి 2898 AD మంచి సినిమా అని .. మంచి బిగ్ స్క్రీన్ సినిమా అంటూ కొనియాడారు. భారతీయ సినిమాలో అత్యుత్తమమైనదని.. నాగి సర్, మొత్తం టీమ్‌కు అభినందనలు అంటూ రాసుకొచ్చారు రణవీర్ సింగ్.

    ఇదిలా ఉంటే ప్రభాస్, కమల్ హాసన్ ఇద్దరినీ “రెబల్ స్టార్ రాక్” అని “ఉలగనాయగన్ ఈజ్ ది బెస్ట్” అంటూ రాసుకొచ్చారు. ఇక తాను అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానిని అన్నారు. అశ్వత్థామ పాత్రను పోషించిన అమితాబ్ బచ్చన్ ను ప్రశంసించారు. అమితాబ్ బచ్చన్ అభిమాని అయితే ఈ సినిమాను మిస్ అవద్దు అన్నారు. అదేవిధంగా రణవీర్ దీపికా పదుకొనే నటనను ప్రశంసించారు.

    “నా బేబీ దీపికా పదుకొనే చాలా అద్భుతంగా నటించింది.నటన, శక్తిని ఢీకొట్టే వారు లేరు.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ తన ప్రేమను తెలిపారు రణవీర్ సింగ్. కల్కి విడుదలై 6 రోజులు మాత్రమే గడుస్తుంది. కానీ ఈ సినిమా ఒక్క ఇండియాలోనే 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా ఈ సినిమాకు విశేషమైన స్పందన లభిస్తుంది. ఏకంగా 160 కోట్లకు పైగా ఓవర్సీస్ బిజినెస్ చేసింది కల్కి. ఇలానే కంటిన్యూ అయితే భారీ రికార్డులు సంపాదించడం ఖాయం అంటున్నారు అభిమానులు.