WCL Cricket 2024: మరో పొట్టి క్రికెట్ సంబరంభానికి వేళయింది.. నేటి నుంచే దిగ్గజాల ఢీ

లెజెండ్స్ పోటీపడుతున్న ఈ క్రికెట్ టోర్నీని అభిమానులు మరో వరల్డ్ కప్ గా పరిగణిస్తున్నారు. దిగ్గజ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, కెవిన్ పీటర్సన్, డెల్ స్టెయిన్, గిబ్స్, షాహిద్ ఆఫ్రిది, గేల్, బ్రెట్ లీ వంటి ఆటగాళ్లు తలపడుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 3, 2024 5:11 pm

WCL Cricket 2024

Follow us on

WCL Cricket 2024: టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. టీమిండియా విజేతగా నిలిచింది. నిన్నటిదాకా టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోయిన వారికి కాస్త కూడా బ్రేక్ ఇవ్వకుండా.. వీనులవిందైన క్రికెట్ అనుభూతి అందించేందుకు సర్వం సిద్ధమైంది. దిగ్గజ క్రికెటర్లు తలపడుతున్న వరల్డ్ ఛాంపియన్ షిప్ టోర్నీ ఇంగ్లాండ్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు (ఇంగ్లాండ్ ఛాంపియన్స్, ఇండియా ఛాంపియన్స్, సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్) పోటీ పడుతున్నాయి.

లెజెండ్స్ పోటీపడుతున్న ఈ క్రికెట్ టోర్నీని అభిమానులు మరో వరల్డ్ కప్ గా పరిగణిస్తున్నారు. దిగ్గజ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, కెవిన్ పీటర్సన్, డెల్ స్టెయిన్, గిబ్స్, షాహిద్ ఆఫ్రిది, గేల్, బ్రెట్ లీ వంటి ఆటగాళ్లు తలపడుతున్నారు. ఈ టోర్నీ సింగిల్ ఫార్మాట్లో జరగనుంది. (ప్రతీ జట్టు ఇతర జట్టుతో ఆడుతుంది) ఈ టోర్నీ జూలై మూడున మొదలై జూలై 13న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. సింగిల్ రౌండ్ తర్వాత టాప్ -4 లో ఉండే జట్లు సెమీఫైనల్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్ లో తలపడతాయి. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జూలై 5న జరుగుతుంది.

జట్ల వివరాలివే..

భారత్ ఛాంపియన్స్

పవన్ నేగి, అను రీత్ సింగ్, సౌరభ్ తివారీ, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్, ఆర్పీ సింగ్, నమన్ ఓఝా, రాహుల్ శుక్లా, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, గురు కిరణ్ మాన్, రాహుల్ శర్మ.

ఆస్ట్రేలియా ఛాంపియన్స్

బ్రెట్ లీ, జాన్ హేస్టింగ్, కౌల్టర్ నైల్, జేవియర్, సిడిల్, డంక్, కట్టింగ్, షాన్ మార్ష్, టీం ఫైన్, డాన్ క్రిస్టియన్, అరోన్ పించ్, బ్రాడ్ హడిన్, ఫెర్గు సన్, లాఫ్లిన్.

ఇంగ్లాండ్ ఛాంపియన్స్

రవి బొపారా, బెల్, కెవిన్ పీటర్సన్, ఒవైస్ షా, మస్టర్డ్, స్కోఫీల్డ్, మహమ్మద్, సహజద్, ఇస్మాల్ అఫ్జల్, రియాన్ సైడ్ బాటమ్, స్టీఫెన్ ప్యారి, స్టువర్ట్ మేకర్, కెవిన్ ఒబ్రియన్.

వెస్టిండీస్ ఛాంపియన్స్

సామీ, గేల్, శామ్యూల్ బద్రి, రాంపాల్, విలియమ్స్, జాసన్ మహమ్మద్, నవీన్ స్టీవర్డ్, స్మిత్, యాశ్లే వర్న్, సులేమాన్ మన్, చాడ్విక్ వాల్టన్, టేలర్, ఎడ్వర్డ్స్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, జోనాథన్ కార్టర్.

దక్షిణాఫ్రికా ఛాంపియన్స్

జాక్వెస్ కలీస్, గిబ్స్, ఇంద్రాన్ తాహిర్, మకాయ ఎన్తిని, డేల్ స్టెయిన్, ప్రిన్స్, నీల్ మెకంజి, మెక్ లారెన్, జస్టిన్ ఒంటాంగ్, క్లీన్ వెల్ట్, డుమిని, రిచర్డ్ లేవి, విలాస్, పిలాండర్.

పాకిస్తాన్ ఛాంపియన్స్

యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, షాహిద్ ఆఫ్రిది, కమ్రాన్ అక్మల్, అబ్దుల్ రజాక్, రియాజ్, అజ్మల్, సోహైల్ తన్వీర్, సోహెల్ ఖాన్, తన్వీర్ అహ్మద్, మహమ్మద్ హఫీజ్, అమీర్ యామిన్, మాలిక్, సోహైల్ మక్సుద్, ఖాన్ అక్మల్.

షెడ్యూల్ ఇలా

జులై 3 ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్

గురువారం, జూలై 4

సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్
పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్

శుక్రవారం జులై ఐదు

ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా

జూలై 6, శనివారం

ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా
ఇండియా వర్సెస్ పాకిస్తాన్

జూలై 7 ఆదివారం

సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్

జూలై 8, సోమవారం

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

జూలై 9 మంగళవారం

వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్
దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్

జూలై 10 బుధవారం

వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా

జూలై 12 బుధవారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.