Salman Khan: సంజయ్ లీలా భన్సాలీ సల్మాన్ ఖాన్ కాంబో లో సినిమా వచ్చే అవకాశం ఉందా..?

నిజానికి తను సల్మాన్ ఖాన్ సినిమా చేసే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే సంజయ్ లీలా భన్సాలీ రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు సల్మాన్ ఖాన్ ఆ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదట.

Written By: Gopi, Updated On : May 22, 2024 9:05 am

Salman Khan

Follow us on

Salman Khan: బాలీవుడ్ దిగ్గజ దర్శకులలో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఇక రీసెంట్ గా “హీరామండి ది డైమండ్ బజార్” అనే సిరీస్ తో భారీ సక్సెస్ ని అందుకున్నాడు.. ఇక ఆయన చేసిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే షారుఖ్ ఖాన్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన భన్సాలీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అయితే నిజానికి తను సల్మాన్ ఖాన్ సినిమా చేసే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే సంజయ్ లీలా భన్సాలీ రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు సల్మాన్ ఖాన్ ఆ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదట. ఇక దానివల్లే భన్సాలీ ఈ సిరీస్ ని చేయాల్సి వచ్చిందట. ఇక ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు అందరి చూపు భన్సాలీ పైన పడింది. ఇక దానివల్ల ఆయన ఎవరితో సినిమా చేయాలనే విషయంలో చాలా ఆచితూనే నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

అయితే సల్మాన్ ఖాన్ ఇప్పుడు తనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ బన్సాలీ మాత్రం సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి అంత ఇంట్రెస్ట్ గా లేడు అనే విషయం అయితే క్లారిటీ గా తెలుస్తుంది. మరి తను మరొకసారి షారుఖ్ ఖాన్ తో గాని లేదా అమీర్ ఖాన్ తో గాని ఒక సినిమా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారట.

ఇక మొత్తానికైతే సినిమాలో ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ భన్సాలీ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా వస్తుందని అనుకునే వాళ్లకు ఒక చేదు వార్త అనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే హీరామండి సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక కలెక్షన్స్ ను సంపాదించుకున్న ఇండియన్ సిరీస్ గా కూడా మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది…