https://oktelugu.com/

Shah Rukh Khan: కూతురితో కలిసి సినిమా చేయబోతున్న హీరో? ఇంతకీ ఎవరాయన?

నేను మనిషినేగా.. కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలి కదా అంటూ ఆ మధ్య అందరికీ తెలిపారు. కానీ ఇప్పుడే ఐయామ్ బ్యాక్ అంటున్నారు. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలో చేస్తున్నారు అనగానే ఈ సినిమా గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 5, 2024 / 12:01 PM IST

    Shah Rukh Khan

    Follow us on

    Shah Rukh Khan: ఫుల్ బిజీగా ఉంటూ విజయం సాధించిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. అలా సేదతీరుదాం అనుకుంటారో లేదో అప్పుడే మీకోసమే పని వెయిట్ చేస్తుంది. సేదతీరితే ఎలా అన్నట్టు వర్క్ పిలుస్తూనే ఉంటుంది. దీంతో విశ్రాంతిని వైండప్ చేసి, వర్క్ ప్లేస్ కి షిఫ్ట్ అయిపోవడమే చేయాలి. ఇదిగోండి అచ్చం దీన్నే ఫాలో అవుతున్నారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. మరి ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారో ఓ సారి తెలుసుకుందాం.

    నేను మనిషినేగా.. కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలి కదా అంటూ ఆ మధ్య అందరికీ తెలిపారు. కానీ ఇప్పుడే ఐయామ్ బ్యాక్ అంటున్నారు. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలో చేస్తున్నారు అనగానే ఈ సినిమా గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే రేంజ్ లో సినిమా హిట్ కూడా అయింది. ఏకంగా వెయ్యి కోట్లన దాటిన ఇండియన్ సినిమాల జాబితాలోనే నిలిచింది ఈ సినిమా. ఇదే హిట్ ను కంటిన్యూ చేస్తూ షారుఖ్ ఖాన్ ఇమేజ్ ను ఏమాత్రం తగ్గించకుండా మరోసారి భారీగా పెంచిన సినిమా జవాన్.

    డైరెక్టర్ అట్లీని నమ్మి సౌత్ క్రూని తీసుకొని చేసిన సినిమానే జవాన్. పఠాన్ లో మెయిల్ లీడ్ దీపికా తీసుకుంటే జవాన్ లో షారుఖ్ తో పాటు నయనతార ఛాన్స్ తీసుకున్నారు. మొత్తం మీద మరో వెయ్యి కోట్ల సినిమా గా షారుఖ్ లైఫ్ లో నిలిచి పోయింది జవాన్ సినిమా. అదే రేంజ్ లో టైగర్ 3లో కూడా గెస్ట్ రూల్ లో చేసి మెప్పించారు షారుఖ్ ఖాన్.

    గత సంవత్సరమే ఆయన కెరీర్‌లో విడుదలైన మరో సినిమా డంకీ. ఈ మూవీని సౌత్‌లో ఎందుకో పెద్దగా ప్రమోట్‌ చేయలేదు చిత్ర యూనిట్. ప్రమోట్ చేస్తే కచ్చితంగా కలెక్షన్లు పెరిగేవే. ఇన్ని సినిమాల తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నారు బాలీవుడ్ బాద్ షా. మళ్లీ ఇప్పుడు ఆయన వర్క్ స్టార్ట్ చేయబోతున్నారట. కూతురితో కలిసి కింగ్‌ మూవీ చేస్తున్నారు ఈ స్టార్ హీరో. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ మూవీలో మెంటర్‌ రోల్‌కి సిద్ధం అయ్యారట. 2023 మేజిక్‌ని ఈ సినిమాతో మళ్లీ రిపీట్‌ చేస్తారనే హోప్‌ కనిపిస్తోంది అంటున్నారు ఆయన అభిమానులు. మరి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే.