https://oktelugu.com/

Salman Khan: సల్మాన్ ఖాన్ కావాలనే అల్లు అర్జున్ నుంచి అట్లీ ప్రాజెక్ట్ ను లాక్కున్నాడా..?

రెమ్యూనరేషన్ విషయంలో వచ్చిన విభేదాల వలన అట్లీ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అదే స్క్రిప్ట్ ని ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 20, 2024 / 08:34 AM IST

    Salman Khan

    Follow us on

    Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ సౌత్ సినిమా దర్శకుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఏ ఆర్ మురగదాస్ డైరెక్షన్ లో ‘సికిందర్ ‘ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. నిజానికి అట్లీ తన ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ తో చేయాల్సింది.

    కానీ రెమ్యూనరేషన్ విషయంలో వచ్చిన విభేదాల వలన అట్లీ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అదే స్క్రిప్ట్ ని ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అట్లీ తో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఆయన అల్లు అర్జున్ తో సినిమా కమిట్ అయి ఉన్నాడు.

    కాబట్టి ఆ ప్రాజెక్టు ను ఎలాగైనా క్యాన్సిల్ చేసి మనం సినిమా చేద్దాం అని అట్లీ తో సల్మాన్ ఖాన్ చెప్పడంతోనే అట్లీ తనకు అంతగా మార్కెట్ లేకపోయినప్పటికీ ఆయన 80 కోట్ల రెమ్యూనరేషన్ అడగడంతో నిర్మాత అల్లు అరవింద్ అట్లీ ని వెనక్కి పంపించాడు. ఇక దాంతో తను సల్మాన్ ఖాన్ తో సినిమాని అనౌన్స్ చేశాడు. ఇక మొత్తానికైతే సల్మాన్ ఖాన్ ఎలాగైనా హిట్ కొట్టాలని సౌత్ డైరెక్టర్ల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే అట్లీ అల్లు అర్జున్ కి హ్యాండ్ ఇచ్చి కండల వీరుడి తో సినిమా చేయడం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిగ్గా మారింది. ఇక బాలీవుడ్ హీరోలు ఎలాగైనా సరే సౌత్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ ని ఎంచుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వరుసగా ఇద్దరు సౌత్ డైరెక్టర్లతో వర్క్ చేస్తున్న సల్మాన్ ఖాన్ సూపర్ సక్సెస్ కొట్టడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…