Deepika Padukone: వైరల్ గా మారిన దీపికా పదుకొణె బేబీ బంప్ పిక్స్

దీపికా బేబీ బంప్ మీద చేతులు పెట్టుకొని నేను ఇలా అవడానికి కారణం ప్రభాస్ అంటూ ఫన్నీగా స్పందించింది. షూటింగ్ లో ఉన్నప్పుడు తన ఇంటి నుంచి తెచ్చే భోజనం వల్లనే ఇలా మారిపోయాను అంటూ నవ్వింది.

Written By: Swathi, Updated On : June 20, 2024 1:28 pm

Deepika Padukone

Follow us on

Deepika Padukone: ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎదురుచూపులు మామూలుగా ఉండవు. అదే తరుణంలో ప్రస్తుతం అభిమానులు ‘కల్కి’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూన్ 27 న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవడానికి సిద్ధం అయింది. దీంతో సినిమా ప్రమోషన్లు భారీ ఎత్తును చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ముంబై లో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో ప్రభాస్‌తో పాటు దీపిక, అమితాబ్, కమల్ హాసన్ లతో పాటు దగ్గుబాటి రానా కూడా పాల్గొన్నారు.

ఈ ఈవెంట్ లో దీపికా పదుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీనికి కారణం లేకపోలేదు. ఈమె బేబీ బంప్ తోనే ఈవెంట్ లో దర్శనం ఇచ్చింది. ఫోటోలకు బేబీ బంప్ తోనే ఫోజులు ఇవ్వడంతో ఆమెను చూసి అభిమానులు సంతోషంతో ఉన్నారు. కాటన్ బాడీకాన్ డ్రెస్‌లో చిన్న చిరునవ్వుతో కనిపించింది ఈ కాబోయే మమ్మీ. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 29న, దీపికా, రణవీర్ లు గర్భం దాల్చిన ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో పుట్టబోయే బిడ్డ బట్టలు, బూట్లు, టోపీ, బెలూన్లు వంటివి ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే దీపికా ప్రెగ్నెంట్ కాదని.. ఈమె కూడా సరోగసి ద్వారా మాత్రమే పిల్లలను కనబోతుందని ట్రోల్ చేశారు. వీటికి రిప్లే ఇచ్చిన బ్యూటీ వీటికి సమాధానంగా బేబి బంప్తో పోస్ట్ పెట్టి.. Okay enough…Now I’m hungry!అంటూ రాసుకొచ్చింది. దీంతో దీపికా ప్రెగ్నెంట్. ఈమె బేబీ బంప్ చూస్తేనే తెలుస్తుంది కదా అంటూ తనకు సపోర్ట్ చేస్తున్నారు ఆమె అభిమానులు.

ప్రభాస్ వల్లనే..
దీపికా బేబీ బంప్ మీద చేతులు పెట్టుకొని నేను ఇలా అవడానికి కారణం ప్రభాస్ అంటూ ఫన్నీగా స్పందించింది. షూటింగ్ లో ఉన్నప్పుడు తన ఇంటి నుంచి తెచ్చే భోజనం వల్లనే ఇలా మారిపోయాను అంటూ నవ్వింది. ఎంతో ఇష్టంగా మూవీ టీమ్ కోసం భోజనం తెచ్చేవారు ప్రభాస్ అని..అది భోజనం మాదిరి కాకుండా క్యాటరింగ్ లా ఉండేది అంటూ తెలిపింది. అంతేకాదు ఈ హీరో ఇంటి నుంచి ఎలాంటి స్పెషల్ ఫుడ్ వస్తుందని ప్రతి రోజు వెయిట్ చేసేదట ఈ బ్యూటీ. మొత్తం మీద కల్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకర్షణంగా నిలిచింది.