Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణి కి షాక్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో…

బాలీవుడ్ దర్శకులను నమ్ముకుంటే పని అయ్యేలా లేదని సల్మాన్ ఖాన్ సౌత్ సినిమా దర్శకుల మీద పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వరుసగా రెండు మూడు ఫ్లాప్ లతో ఉన్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 14, 2024 1:50 pm

Rajkumar Hirani

Follow us on

Rajkumar Hirani: బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి..ఇక డంకీ సినిమాకి ముందు వరకు తనకి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక డంకీ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలకు చెక్ పెడుతూ ఈ సినిమా ఫ్లాప్ అవడం రాజ్ కుమార్ హిరాణి ని కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి. ఇక సలార్ సినిమాకి పోటీగా రిలీజ్ చేసిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజ్ కుమార్ హిరాణి కి సైతం మొదటిసారి ఫ్లాప్ ను తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే డంకీ సినిమా తర్వాత రాజ్ కుమార్ హిరాణి సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. దానికి సల్మాన్ ఖాన్ కూడా గ్రీన్ సిగ్నన్ ఇచ్చాడు. కానీ డంకీ ఫ్లాప్ అయిన తర్వాత సల్మాన్ ఖాన్ ఆయనతో సినిమా చేయాలనుకున్న ఆలోచనను విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే సౌత్ సినిమా దర్శకుడు అయిన మురుగదాస్ తో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక బాలీవుడ్ దర్శకులను నమ్ముకుంటే పని అయ్యేలా లేదని సల్మాన్ ఖాన్ సౌత్ సినిమా దర్శకుల మీద పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వరుసగా రెండు మూడు ఫ్లాప్ లతో ఉన్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

అందుకే రాజ్ కుమార్ కి హ్యాండ్ ఇచ్చి సౌత్ సినిమా దర్శకుడి తో సినిమా చేస్తున్నాడు. ఇక ఇంతకుముందు షారుఖ్ ఖాన్ కూడా అట్లీ దర్శకత్వంలో ‘జవాన్ ‘ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది…