https://oktelugu.com/

Priyanka Chopra: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కు తీవ్ర గాయాలు.. షాకింగ్ ఫోటోలు వైరల్…

సోషల్ మీడియా ద్వారా తన జీవితానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంటున్న 'ది బ్లఫ్' సినిమా షూట్ లో భాగంగా ఆమెకు మెడ దగ్గర గాయాలు అయ్యాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 04:37 PM IST

    Priyanka Chopra

    Follow us on

    Priyanka Chopra: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సెటిలైంది. అయినప్పటికీ ఆమె ఇప్పటికీ కూడా తన సినిమాలను చేస్తూ ప్రొఫెషన్ ను మాత్రం ఎక్కడ వదిలిపెట్టకుండా దానికోసం అహర్నిశలు కష్టపడుతుంది. ఇక ప్రస్తుతం ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక ఈమె తరచుగా తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.

    ఇక సోషల్ మీడియా ద్వారా తన జీవితానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంటున్న ‘ది బ్లఫ్’ సినిమా షూట్ లో భాగంగా ఆమెకు మెడ దగ్గర గాయాలు అయ్యాయి. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ‘ ఓహ్ ది ప్రొఫెషనల్ హాజర్డ్ ఆఫ్ మై జాబ్’ అనే క్యాప్షన్ తో ఆ ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆమెకు మెడ దగ్గర గాయాలైతే తగిలాయి.

    ఇంకా ఇది చూసిన ఆమె అభిమానులు గాయాలు తగిలేలా షూటింగ్ చేయడం ఎందుకు డూప్ లను వాడొచ్చు కదా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం వర్క్ డెడికేషన్ అంటే అలాగే ఉంటుంది.గాయాలైన కూడా తను ఇష్టపడే సినిమా కోసం ఎంతటి కష్టాన్ని అయిన ప్రియాంక భరిస్తుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తన ఫ్యాన్స్ తన మీద చూపించే అభిమానాన్ని చూస్తుంటే ప్రియాంక చోప్రా వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకుందనే చెప్పాలి.

    ఇక మొత్తానికైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ సినిమాలను సైతం చేయడం విశేషం… ఇక తను గాయం నుంచి తొందరగా కోలుకొని మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు…ఇక ఆమె తన కెరియర్ లో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది…