https://oktelugu.com/

అత్యంత సంప‌న్న హీరో చాటుమాటు వ్యవహారాలు !

అత్యంత సంప‌న్న కుటుంబంలో పుట్టాడు అతను. ఎలా వచ్చిందో తెలియదు, హీరో అవ్వాలనే కోరిక అతనిలో రోజురోజుకు అతనితో పాటే పెరిగి పెద్ద అయింది. తనకున్న డబ్బు సాయంతో అతగాడు హీరో అయ్యాడు. హీరో అవ్వడానికి నిర్మాత‌ కూడా అయ్యాడు. కానీ వ్యాపార‌వేత్తగా ఫుల్ సక్సెస్ లో ఉన్న అతను, హీరోగా కనీసం ఒక్క హిట్ కూడా కొట్టలేక చేతులెత్తేశాడు. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో అతగాడి గురించి ఒక న్యూస్ వినిపిస్తోంది. గుట్కా అక్ర‌మ […]

Written By:
  • admin
  • , Updated On : May 29, 2021 / 06:53 PM IST
    Follow us on

    అత్యంత సంప‌న్న కుటుంబంలో పుట్టాడు అతను. ఎలా వచ్చిందో తెలియదు, హీరో అవ్వాలనే కోరిక అతనిలో రోజురోజుకు అతనితో పాటే పెరిగి పెద్ద అయింది. తనకున్న డబ్బు సాయంతో అతగాడు హీరో అయ్యాడు. హీరో అవ్వడానికి నిర్మాత‌ కూడా అయ్యాడు. కానీ వ్యాపార‌వేత్తగా ఫుల్ సక్సెస్ లో ఉన్న అతను, హీరోగా కనీసం ఒక్క హిట్ కూడా కొట్టలేక చేతులెత్తేశాడు.

    అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో అతగాడి గురించి ఒక న్యూస్ వినిపిస్తోంది. గుట్కా అక్ర‌మ ర‌వాణా కేసులో అతగాడికి ప్రమేయం ఉందట. దుబాయ్ నుంచి ముంబ‌య్‌ కి డ్రగ్స్ ను తెప్పించడంలో ఇతగాడు ఆరితేరిపోయాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఈ టాక్ కి తగ్గట్టుగానే ఇత‌న్ని గతంలో ఇలాంటి డ్రగ్స్ వ్యవహారంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    హిందీలో అత్యంత సంపన్న నటుల్లో ఒకడైన ఇతనికి డ్రగ్స్ బిజినెస్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ, ఇలాంటి వాటిల్లో అనుభవం ఉన్న వ్యక్తిగా ఇతను బాగా గుర్తింపు పొందాడు. ఆల్ రెడీ గుట్కా వ్యాపారంలో రాటుదేలాడు కూడా. గుట్కా కింగ్‌ గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు కూడా. అందుకే ఈ లాక్ డౌన్ లో బాలీవుడ్ ప్రముఖులకు మత్తును అందించే శక్తిగా ఇతగాడు మారిపోయాడట.

    ఎలాగూ గుట్కా వ్యాపారంలో అక్రమంగా భారీగా సంపాదించి జ‌ల్సాలు చేయ‌డంతో పాటు ఆ డ‌బ్బుతోనే సినిమాలు చేస్తున్నారని టాక్ ఇతగాడి పై ఉంది. మరి అక్ర‌మ సంపాద‌న‌తో ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ అత్యంత సంప‌న్న హీరో చేస్తోన్న ఈ చాటుమాటు వ్యవహారాలు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతాయో చూడాలి