https://oktelugu.com/

డ్రగ్స్ కేసులో తెరపైకి మరో హీరోయిన్ పేరు..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సుశాంత్ కుటుంబ సభ్యులు.. అభిమానులు మాత్రం సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. ఎవరో హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పలువురు సినీ, రాజకీయ నాయకులు సైతం సుశాంత్ ను కొందరు హత్య చేశారంటూ ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న తీరుచూస్తుంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2020 / 12:02 PM IST
    Follow us on


    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సుశాంత్ కుటుంబ సభ్యులు.. అభిమానులు మాత్రం సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. ఎవరో హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పలువురు సినీ, రాజకీయ నాయకులు సైతం సుశాంత్ ను కొందరు హత్య చేశారంటూ ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న తీరుచూస్తుంటే అసలు విషయం పక్కదారి పట్టినట్లు కన్పిస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ లింకులు ఉన్నట్లు తేలింది. దీంతో సీబీఐ, ఎన్సీబీ రంగంలోకి దిగి కేసును ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా డ్రగ్స్ కేసులోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ఈ కేసులో ఇప్పటికే పికల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు షోవిక్, డ్రగ్ డీలర్ బాసిత్, శశాంక్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు విచారణలో రియా చక్రవర్తి పలు సంచలన విషయాలను వెల్లడించింది.

    Also Read: షాకిచ్చిన బిగ్‌బాస్.. నోయల్ కే పట్టం..

    ఈ కేసులో రియా చక్రవర్తితోపాటు  పలువురి ప్రముఖ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. సంజనా గల్రాని.. రాగిణి ద్వివేది.. సారా అలీఖాన్.. రకుల్ ప్రీతి సింగ్ పేర్లు డ్రగ్స్ కేసుల్లో ప్రముఖంగా విన్పించాయి. ఇప్పటికే పోలీసులు పలువురికి నోటీసులు పంపించి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ‘సాహో’లో ప్రభాస్ కు జోడీగా నటించిన శ్రద్ధాకపూర్ కూడా డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

    సుశాంత్ కు చెందిన పాన్వెల్ ఫాంహౌజ్ లో సెలబ్రెటీలంతా డ్రగ్స్ పార్టీలు చేసుకునేవారని ఎన్సీబీ విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని ఆ ఫాంహౌజ్ మేనేజర్ రజత్ ధృవీకరించాడు. తాజాగా పాన్వెల్ ఫాంహౌజ్లో బోటు వర్కర్ గా పని చేసే ఓ వ్యక్తి మరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఇటీవల ఫాంహౌజ్ లో జరిగిన పార్టీలో రియా, సారాతోపాటు శ్రద్ధాకపూర్ కూడా పాల్గొన్నట్లు చెప్పాడు.

    Also Read: పవన్ -త్రివిక్రమ్ సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు..’!

    వీరంతా ఇక్కడే పార్టీలు చేసుకొనే వారని.. ఆ తర్వాత తన బోటులో షికారుకు వెళ్లేవారని తెలిపాడు. ఆ సమయంలో వారంతా ఆల్కహాల్, మారిజువానా లాంటి డ్రగ్స్ తీసుకునే వారని ఆరోపించాడు. సుశాంత్ ఫాంహౌజ్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు తేలడంతో శ్రద్ధాకపూర్ కూడా డ్రగ్స్ తీసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. డ్రగ్స్ కేసులో రోజుకో హీరోయిన్ పేరు తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. సుశాంత్ ఆత్మహత్య కేసు చివరికీ బాలీవుడ్లోని ప్రముఖుల మెడకు చుట్టుకునేలా కన్పిస్తోంది.