దేశంలో 9మంది అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమైనా అతడు స్థాపించిన ‘అల్ ఖైదా’ ఉగ్రవాద సంస్థ మాత్రం ఇంకా ప్రతీకారంతో రగులుతూనే ఉంది. తాజాగా దేశంలోనూ మారణహోమం సృష్టించడానికి రెడీ అయ్యింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 9మంది అల్ ఖైదా ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. అల్ ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాదులను ఎన్ఐఏ గుర్తించి అరెస్ట్ చేసింది. Also Read: రూ.100 లక్షల కోట్ల అప్పు.. కేంద్రానికి […]

Written By: NARESH, Updated On : September 19, 2020 12:08 pm

Al Qaeda

Follow us on

కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమైనా అతడు స్థాపించిన ‘అల్ ఖైదా’ ఉగ్రవాద సంస్థ మాత్రం ఇంకా ప్రతీకారంతో రగులుతూనే ఉంది. తాజాగా దేశంలోనూ మారణహోమం సృష్టించడానికి రెడీ అయ్యింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 9మంది అల్ ఖైదా ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. అల్ ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాదులను ఎన్ఐఏ గుర్తించి అరెస్ట్ చేసింది.

Also Read: రూ.100 లక్షల కోట్ల అప్పు.. కేంద్రానికి తప్పలేదు!

పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్, కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం నగరాల్లో ఎన్ఐఏ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు చేశారు. అల్ ఖైదా ఉగ్రసంస్థతో సంబంధాలున్న 9మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. నిషేధిత అల్ ఖైదా ఉగ్రసంస్థకు చెందిన 9మంది ఉగ్రవాదులు ముర్షిదాబాద్ ఎర్నాకుళం కేంద్రాలుగా పనిచేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. వీరిని అరెస్ట్ చేసి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులు, జిహాది సాహిత్యం, ఆయుధాలు, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ తెలిపింది.ఢిల్లీ, ఎన్సీఆర్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు అల్ ఖైదా ఉగ్రవాదులు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. ముర్సిదాబాద్ లో ఆరుగురు, ఎర్నాకుళంలో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

Also Read: ఐపీఎల్ వేళాయే.. రేపటి నుంచి క్రికెట్ పండుగ

అరెస్ట్ అయిన అల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశానికి చెందిన అల్ ఖైదా ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.