Alia Bhatt: ఎన్టీఆర్ అంటే ఆ హీరోయిన్ కి అంత చులకనా… ఎన్నిసార్లు రిజెక్ట్ చేసిందో తెలుసా?

తారక్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఒకే చెప్పాల్సిందే. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు నిరాకరించిందట. ఒకటి కాదు .. రెండు కాదు. ఏకంగా మూడు సార్లు ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.

Written By: S Reddy, Updated On : June 12, 2024 10:35 am

Alia Bhatt

Follow us on

Alia Bhatt: అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. అటువంటి స్టార్ హీరో తో కలిసి నటించే అవకాశం కోసం హీరోయిన్లు ఎదురుచూస్తుంటారు. తారక్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఒకే చెప్పాల్సిందే. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు నిరాకరించిందట. ఒకటి కాదు .. రెండు కాదు. ఏకంగా మూడు సార్లు ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ఆమెకు ఎన్టీఆర్ తో మూడు సార్లు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందట. కానీ ఏవేవో కారణాల వల్ల వదిలేసిందట. కొన్ని సార్లు కథ నచ్చక నో చెప్పిందట. మరికొన్ని సార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట. చివరికి ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి పని చేశారు. కానీ ఇందులో అలియా… రామ్ చరణ్ కి జంటగా నటించింది. ఆ తర్వాత దేవర లో ముందుగా ఆలియా భట్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారట.

కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ అవకాశం మరోసారి చేజారింది. ఆమె స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని తీసుకున్నారు. అయితే ఆలియా భట్, తారక్ కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే .. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. మరోపక్క బాలీవుడ్ మూవీ వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు ఎన్టీఆర్. అనంతరం ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు. తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న దేవర త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 10న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల దేవర నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది.