https://oktelugu.com/

Bollywood Hero: తను చేసిన ప్లాప్ లతో ఇప్పటి వరకు 1000 కోట్ల నష్టాలను మిగల్చాడు.. ఎవరీ బాలీవుడ్ అన్ లక్కీ హీరో అంటే?

గత చిత్రమైన 'బడే మియ చోటే మియన్ ' సినిమా 250 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది. ఇక మొత్తానికైతే వరుసగా ఆయన చేసిన 13 సినిమాలతో 1000 కోట్లకు పైన నష్టాన్ని మిగిల్చిన సినిమాలను చేశాడనే ఒక బ్యాడ్ రికార్డ్ కూడా మూటగట్టుకున్నాడు... ఇక ఇదిలా ఉంటే సర్ఫీరా సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయిన 5 రోజులకి 100 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇక ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ రోజే వందకొట్ల పైన కలెక్షన్స్ ను వసూలు చేస్తాయంటూ అక్కడి స్టార్ హీరోలు ప్రగల్భాలు పలుకుతూ ఉండేవారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 17, 2024 10:33 am
    Bollywood Hero

    Bollywood Hero

    Follow us on

    Bollywood Hero: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుందనే విషయం మన అందరికి తెలిసిందే… ఒకప్పుడు సక్సెస్ ఫుల్ సినిమాలను మాత్రమే చేస్తాడు అనే గుర్తింపు ఉన్న అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సైతం ఇప్పుడు వరుస డిజాస్టర్లను అందుకోవడం అనేది నిజంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అక్షయ్ కుమార్ సంవత్సరానికి ఒక మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తాడు. ఇలాంటి క్రమంలో ఆ నాలుగులో కనీసం మూడు సినిమాలైనా సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఉంటాయి. అలాంటి అక్షయ్ కుమార్ కూడా ఇప్పుడు తన మార్క్ ను ఏమాత్రం చూపించకుండా వరుసగా డిజాస్టర్లను అందుకోవడం బాలీవుడ్ ఇండస్ట్రీని చాలా వరకు కలవరపెడుతుంది.

    ఇక సౌత్ సినిమాల హవా పెరుగుతున్న క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీని ఎవరు ఆదుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అక్షయ్ కుమార్ మీదే ట్రేడ్ పండితులు సైతం కొంతవరకు హోప్స్ పెట్టుకున్నప్పటికీ ఆయన కూడా చేతులెత్తేసినట్టుగా తెలుస్తుంది. ఇక అసలు విషయం లోకి వస్తే సుధా కొంగర డైరెక్షన్ లో సూర్య హీరోగా తమిళం లో వచ్చిన ‘సురారై పోట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దు రా ‘ అనే సినిమాను బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ‘ సర్ఫీరా ‘ అనే పేరుతో రీమేక్ చేశాడు… నిజానికి ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఓటిటి ల్లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. అలాంటి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడం కొంత వరకు మంచి విషయమే అయినప్పటికీ ఆ సబ్జెక్టును మాత్రం అక్కడి ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోయారు. దానివల్లే సినిమా అనేది డిజాస్టర్ టాక్ తో ముందుకు సాగుతుంది. ఇక ఈ సినిమా తో అక్షయ్ కుమార్ వరుసగా 13 డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

    Bollywood Hero

    Bollywood Hero

    ఇక గత చిత్రమైన ‘బడే మియ చోటే మియన్ ‘ సినిమా 250 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది. ఇక మొత్తానికైతే వరుసగా ఆయన చేసిన 13 సినిమాలతో 1000 కోట్లకు పైన నష్టాన్ని మిగిల్చిన సినిమాలను చేశాడనే ఒక బ్యాడ్ రికార్డ్ కూడా మూటగట్టుకున్నాడు… ఇక ఇదిలా ఉంటే సర్ఫీరా సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయిన 5 రోజులకి 100 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇక ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ రోజే వందకొట్ల పైన కలెక్షన్స్ ను వసూలు చేస్తాయంటూ అక్కడి స్టార్ హీరోలు ప్రగల్భాలు పలుకుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో చేసిన సినిమా ఇన్ని రోజులకు 100 కోట్ల మార్క్ అందుకోవడం నిజంగా చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి… ఇక రోజు రోజు కి బాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుందని చెప్పడానికి ఈ సినిమాను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇక 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ మీద పెట్టినంత ఇంట్రెస్ట్ సినిమాల మీద పెట్టడం లేదు. అందువల్లే సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఆయన చేసే పర్ఫామెన్స్ లో ఒక స్పార్క్ కనిపించేది.

    ఇప్పుడు అలాంటి పర్ఫామెన్స్ ఏమీ కనిపించడం లేదు. ఏదో సినిమాలు చేస్తున్నావా అంటే చేస్తున్నాను అన్నట్టుగా సాగుతుంది. అంతే తప్ప డెడికేషన్ తో అయితే తను వర్క్ చేయడం లేదు. అందువల్లే సినిమా ప్రేక్షకులకి నచ్చడం లేదు. అలాగే ఆయన ఎంచుకున్న స్క్రిప్ట్ లో కూడా దమ్ము అయితే ఉండడం లేదు. కాబట్టి ఆ సినిమాలు ప్రేక్షకుల్ని ఏ రకంగాను అలరించడం లేదంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇకమీదట కూడా అక్షయ్ కుమార్ ఇలాంటి ప్లాపుల పరం పరంను కొనసాగించినట్లైతే ఆయన మార్కెట్ భారీగా డౌన్ అవ్వడమే కాకుండా ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీగా తగ్గించుకునే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఇకమీదట అక్షయ్ కుమార్ ఎలాంటి సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తాడనేది…