Maruti Wagon R: దేశీయ ఆటో మోబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ అగ్రగామిగా నిలుస్తోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎలక్ట్రిక్ వేరియంట్ వరకు.. అన్ని వర్గాల వారికి అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేసే ఈ కంపెనీని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. దీని నుంచి రిలీజ్ అయిన ఏ కారు అయినా అది బెస్ట్ గానే భావిస్తారు కొందరు. ఇప్పటి వరకు మారుతి ద్వారా ఆల్టో కే నుంచి.. నిన్నటి స్విప్ట్ కొత్త కారు వరకు ఎన్నో మోడళ్లు వచ్చాయి. కానీ 2019లో రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్ మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఎస్ యూవీ నుంచి ఎలక్ట్రిక్ కారును కోరుకుంటున్న నేటి రోజుల్లో ఈ హ్యాచ్ బ్యాక్ కారు కోసం ఇంకా ఎగబడుతున్నారంటే మామూలు విషయం కాదు. వ్యాగన్ ఆర్ రిలీజ్ అయి ఐదున్నరేళ్లు అవుతోంది. ఈ కాలంలో వ్యాగన్ ఆర్ సృష్టించిన ప్రభంజనం మాములుగా లేదు.. ఆ వివరాల్లోకి వెళితే..
మారుతి సుజుకీ నుంచి వ్యాగన్ ఆర్ 2019లో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ మోడల్ మొత్తం 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ లో అందుబాటులో ఉన్న వ్యాగన్ ఆర్ తరువాత ఆల్టో కే 10, బాలెనో, బ్రెజ్జా, సెలెరియో, డిజైర్ వంటి కార్లు వచ్చాయి. కానీ వాటిని కాదని వ్యాగన్ ఆర్ సేల్స్ లో దూసుకుపోతుంది. వ్యాగన్ ఆర్ రిలీజ్ అయి ఇప్పటి వరకు 5.5 ఏళ్లు అవుతోంది. ఈ కాలంలో ఈ కారు 10 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు అమ్మడం విశేషం. ఒక్క 2023 ఆర్థిక సంవత్సరంలోనే 2,12, 340 యూనిట్లు విక్రయించడం చూస్తే ఈ కారు మానియా ఏంటో అర్థం అవుతోంది.
2019లో ఈ కారు మార్కెట్లోకి వచ్చిన సమయంలో ఏడాది సేల్స్ కేవలం 41,873 మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో కేవలం 11 శాతంతో మాత్రమే ఉండేది. కానీ ఆ తరువాత దీని అమ్మకాలు పుంజుకున్నాయి. 2020 నుంచి వ్యాగన్ ఆర్ ప్రభంజనం మొదలైందని చెప్పవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,56,724 యూనిట్లు విక్రయించింది. ఆ తరువాత 2021లో 1,60,330 కార్లను అమ్మారు. 2023లో 2,21,340 సేల్స్ నమోదు చేసుకుంది. 2024 పైనాన్స్ ఇయర్ ప్రారంభమై ఇప్పటి వరకు 46,132 యూనిట్లు అమ్మారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే దీని సేల్స్ పెరుగతాయిన అంటున్నారు.
2020 నుంచి వ్యాగన్ ఆర్ సేల్స్ పెరగడం ప్రారంభించాయి. ప్రస్తుతం కాలంలో ఎక్కువగా ఎస్ యూవీ కోరుకుంటున్నా.. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ ను కలిగి ఉన్న వ్యాగన్ ఆర్ కోసం జనం ఎగబడుతున్నారు. వ్యాగన్ ఆర్ లో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ , 1.2 లీటర్ 4 సిలిండ్ పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్లను కలిగి ఉంది. దీనిని రూ.6.37 లక్షల ప్రారంభం నుంచి రూ. 8.51 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
మారుతి నుంచి ఎస్ యూవీలు వచ్చాయి. త్వరలో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. కానీ ఈ హ్యాచ్ బ్యాక్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లో బడ్జెట్ లో లభించే ఈ కారు మరింత సేల్స్ పెరిగే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. మారుతి నుంచి ఎన్నో కార్లు ఉన్నా వ్యాగర్ ఆర్ రికార్డులు సృష్టించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.