Bollywood star heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తోందనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ హవా పూర్తిగా తగ్గింది. ఎట్టకేలకు అనిమల్ సినిమాతో రన్బీర్ కపూర్, దురందర్ సినిమాతో రన్వీర్ సింగ్ లాంటి యంగ్ హీరోలు మాత్రమే బాలీవుడ్ ఇండస్ట్రీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ స్టార్ హీరోలిద్దరి మధ్య భారీ పోటీ అయితే నెలకొంది…
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాన్ త్రయం ముగిసిందనే చెప్పాలి. వాళ్ళ తర్వాత జనరేషన్ గా వచ్చిన రన్బీర్ కపూర్, రన్వీర్ సింగ్ ఇద్దరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా దురంధర్ సినిమాతో రన్వీర్ సింగ్ సాధించిన విజయమైతే చాలా గొప్పదనే చెప్పాలి.
ఆల్మోస్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయింది అనుకున్న సందర్భంలో ఆయన రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించి ఇండస్ట్రీని మళ్ళీ టాప్ పొజిషన్ లోకి తీసుకొచ్చాడు. ఇక ఇప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ను డామినేట్ చేస్తే ముందుకు సాగుతున్నారు. అయినప్పటికి కనీసం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పోటీ ఇచ్చే స్థాయికి అయిన బాలీవుడ్ ఇండస్ట్రీ రాగలిగిందనే ఒక చిన్న సంతృప్తి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి కలిగింది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాలని చాలామంది ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కావడం లేదు. మరి రాబోయే రోజుల్లో మన తెలుగు సినిమాలతో పోటీపడి బాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు సాగితే నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి. కానీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించే హీరోలు అక్కడ చాలావరకు కరువయ్యారనే చెప్పాలి… ఇక మన టైర్ వన్ హీరోలు ఒక్కసారి వరుసగా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసినట్లయితే మాత్రం సినిమా ఇండస్ట్రీ షేక్ అవుతుందనే చెప్పాలి…