https://oktelugu.com/

Lucky Bhaskar movie Remake : లక్కీ భాస్కర్’ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్న ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

లక్కీ భాస్కర్' చిత్రాన్ని బాలీవుడ్ రీమేక్ చేయడానికి అక్కడి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారట. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని భారీ రేట్ కి కొనుగోలు చేసాడట.

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 10:10 PM IST

    Lucky Bhaskar movie Remake

    Follow us on

    Lucky Bhaskar movie Remake :  తెలుగు, తమిళం, హిందీ, మలయాళం ఇలా భాషల్లోనూ సూపర్ హిట్స్ ఉన్నటువంటి ఏకైక నేటి తరం హీరో దుల్కర్ సల్మాన్. మమ్మూటీ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ నాలుగు దశాబ్దాలుగా మమ్మూటీ కూడా సాధించని ఎన్నో అరుదైన రికార్డ్స్ ని తన ఖాతాలో వేసుకొని ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకడిగా మారిపోయాడు. ముఖ్యంగా మన తెలుగు లో ఈయన హీరో గా రెండు సినిమాలు చేస్తే, రెండు కూడా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా ఈయన హీరో గా నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను, వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఇదంతా పక్కన పెడితే ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని బాలీవుడ్ రీమేక్ చేయడానికి అక్కడి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారట. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని భారీ రేట్ కి కొనుగోలు చేసాడట. షాహిద్ కపూర్ ఈ చిత్రం లో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్. షాహిద్ కపూర్ ఇది వరకే అర్జున్ రెడ్డి చిత్రాన్ని ‘కబీర్ సింగ్’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి, భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో షాహిద్ కపూర్ కి ఒక రేంజ్ లో క్రేజ్ కలిసొచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని రీమేక్ చేసాడు. ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

    ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని రీమేక్ చేసి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ గా వెంకీ అట్లూరి నే వ్యవహరించే అవకాశం ఉంది. కచ్చితంగా ఇది బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమానే. కానీ ఓటీటీ కారణంగా ఈమధ్య రీమేక్ సినిమాలు సరిగా థియేటర్స్ లో ఆడడం లేదు. ‘జెర్సీ’ చిత్రం ఫ్లాప్ అవ్వడానికి కారణం కూడా అది రీమేక్ అవ్వడం వల్లే. అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ కి కూడా ఈమధ్య కాలం లో రీమక్స్ వర్కౌట్ అవ్వడం లేదు. ఇలాంటి సమయంలో షాహిద్ కపూర్ రీమేక్ చేసి సక్సెస్ సాధించగలడా?..ఇప్పటికే లక్కీ భాస్కర్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ఒకసారి చూసిన సినిమాని మళ్ళీ థియేటర్స్ కి వెళ్లి చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడుతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఈ రీమేక్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.