Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒకరి తర్వాత మరొకరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కరీనా కపూర్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా తనకు కరోనా సోకినట్టు స్టార్ కిడ్ షనయా కపూర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నాలుగు రోజుల క్రితం టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని, మళ్లీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బావుందని, స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని ఆమె చెప్పారు. తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోమని షనయా కపూర్ కోరారు. ప్రముఖ హిందీ దర్శక – నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో ‘కభీ ఖుషి కభీ గమ్’ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా జరిగిన పార్టీకి హాజరైన తర్వాత కరీనాకు కరోనా సోకింది.

Also Read: ఆ డైరక్టర్‌కి కోపమొస్తే నన్ను కొట్టేవారు- రణబీర్
ఇక అదే పార్టీకి షనయా తల్లి మహీప్ కపూర్ కూడా హాజరయ్యారు. ఆమె కూడా కరోనా సోకింది. ఆమె నుంచి షనయాకు కరోనా సోకి ఉంటుందని ఊహిస్తున్నారు. కరణ్ జోహార్ ఇంట్లో పార్టీకి హాజరైన కరీనా కపూర్, అమృతా అరోరా, సీమా ఖాన్, మహీప్ కపూర్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు మహీప్ కుమార్తె కూడా కరోనా బారిన పడ్డారు. ఆల్రెడీ పార్టీ ఇచ్చిన కరణ్ జోహార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఇంట్లో ఎనిమిది మంది మాత్రమే కలిశామని… దాన్ని పార్టీ అనరని, తమ ఇంట్లో కొవిడ్ ప్రొటొకాల్స్ పాటించమని కరణ్ జోహార్ వివరణ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యులు అందరూ ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేయించుకోగా నెగెటివ్ రిజల్ట్స్ వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఎన్ని కేసులు నమోదు అవుతాయో అని బీ టౌన్ లో చర్చించుకుంటున్నారు.
Also Read: సమంత “యశోద” సినిమాలో ముఖ్య పాత్ర చేయనున్న… నటి వరలక్ష్మి శరత్ కుమార్