https://oktelugu.com/

Shahrukh Khan : ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..? ఇందులో ఎంత వరకు నిజం ఉంది..?

ప్రభాస్ చేసిన వరుస సినిమాలతో తెలుగు లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇండియాలోనే స్టార్ హీరో గా ఎదిగాడు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన కల్కి సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆయన క్రేజ్ మరింత పెరిగింది...

Written By:
  • Gopi
  • , Updated On : July 22, 2024 / 10:50 AM IST
    Follow us on

    Shahrukh Khan : ఇండియాలో తెలుగు సినిమాల హవా పెరుగుతున్న కొద్ది బాలీవుడ్ హీరోల హవా తక్కువైపోతుంది. ఇక అందులో భాగంగా మన తెలుగు హీరోలైతే బాలీవుడ్ హీరోలను డామినేట్ చేయడమే కాకుండా ఏకంగా వాళ్ళ సినిమాలకు ఏమాత్రం క్రేజ్ లేకుండా మనవాళ్లే ఇండస్ట్రీ మొత్తాన్ని అక్రమించుకుంటున్నారు. ఇక దాంతో బాలీవుడ్ హీరోలకి ఏం చేయాలో తెలియడం లేదు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి రాజమౌళి పేరు ఇండియాలో మారుమ్రోగిపోతుంది. అతనితో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపించడమే కాకుండా ఇక వీలైతే ఆయన సినిమాలో కనీసం ఒక చిన్న పాత్ర అయిన చేయాలని స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారంటే ఆయన స్టార్ డమ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దాంతో పాటుగా బాహుబలి మూవీ వేసిన బాటలో మన తెలుగు సినిమాలు నడుస్తూ బాలీవుడ్ లో భారీ సక్సెస్ లను అందుకుంటున్నాయి. ఇప్పటికే పుష్ప, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు అక్కడ పెను ప్రభంజనాన్ని సృష్టించాయి. ఇక దాంతో పాటు ఇప్పుడు రాబోతున్న మరికొన్ని సినిమాల్లో కూడా వాళ్ల హవా ను చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో మన హీరోలను మించిన వాళ్లు మరొకరు లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ బాలీవుడ్ జనాలు మాత్రం దీన్ని ఒప్పుకోవడానికి కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు.ఇక ఇప్పుడు దేశం మొత్తం కూడా తెలుగు హీరోల వైపే చూస్తుంది. ఇక మన హీరోలకి అభిమానులైతే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి…

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియాలోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా మనం ప్రభాస్ ని అభివర్ణించవచ్చు. ఇక ప్రభాస్ చేసిన పాన్ ఇండియా సినిమాలు మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఇక హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా బాహుబలి నుంచి ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు అత్యధికంగా 300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన హీరోల్లో ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇప్పుడు ప్రభాస్ ఒక్క సినిమా కోసం రెమ్యూనరేషన్ గా దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు తీసుకుంటున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక దీన్ని బీట్ చేస్తూ షారుక్ ఖాన్ 220 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే వార్తలైతే సృష్టిస్తున్నారు. నిజానికి షారుఖ్ ఖాన్ తీసుకునేది 120 నుంచి 130 కోట్లు మాత్రమే.. అయినప్పటికీ ప్రభాస్ కి అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే ఉద్దేశ్యంతో అక్కడి జనాలు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

    మరి మొత్తానికైతే మన హీరో అయిన ప్రభాస్ అక్కడ తన ప్రభంజనాన్ని సృష్టించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన ఇప్పటికైతే ప్రభాస్ నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నాడు. అతన్ని బీట్ చేయాలనే సాహసాన్ని అందరూ చేస్తున్నప్పటికీ అది ఎవరి వల్ల కావడం లేదు…ఎందుకంటే ప్రభాస్ ఇప్పటికే స్టార్ హీరో రేంజ్ ను దాటేసాడు. కాబట్టి ఇప్పుడప్పుడే ఆయన్ని బీట్ చేయాలనుకోవడం ఒక దుస్సాహసం అవుతుందనే చెప్పాలి…ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుంటే ఇక ప్రభాస్ ను టచ్ చేసే హీరో మరొకరు ఉండరనేది వాస్తవం…