Bollywood : చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. కానీ దీన్ని చాలా మంది ఒప్పుకోరు. తమకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని అబద్ధాలు చెబుతారు. కానీ బుల్లితెర నుండి వెండితెర వరకు… ప్రస్తుతం స్టార్స్ గా ఉన్న వారు కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఒక స్థాయికి వచ్చే వరకు అమ్మాయిలకు లైంగిక వేధింపులు తప్పవు. కొందరు తెలివిగా కామాంధుల బారిన పడకుండా తమని తాము కాపాడుకుంటారు. కొందరు మోసపోతారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది నటీమణులు ఒప్పుకున్నారు.
కొందరైతే ఉద్యమాలు చేశారు. అమెరికాలో మొదలైన మీటూ ఉద్యమం ఇండియాకు పాకింది. టాలీవుడ్ లో శ్రీరెడ్డి, బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా, కోలీవుడ్ లో సింగర్ చిన్మయి కొందరు చిత్ర ప్రముఖుల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాజాగా బాలీవుడ్ సీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి దహియా క్యాస్టింగ్ కౌచ్ పై కీలక ఆరోపణలు చేసింది.
కెరీర్ బిగినింగ్ లో దివ్యాంక బ్రతకడానికి కూడా చాలా కష్టాలు పడిందట. చిన్న చిన్న పనులు చేసిందట . టూత్ పేస్ట్ బాక్సులు సేకరించి వాటిని అమ్మి జీవనం సాగించిందట. బ్రతకడానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాలి. సీరియల్ నటిగా ఎదిగే క్రమంలో నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని దివ్యాంక అన్నారు.
ఓ సీరియల్ లో ఆఫర్ ఉందని వెళితే… డైరెక్టర్ తో మీరు ఒక రాత్రి గడపాలి. అందుకు సిద్ధం అయితే మీకు మంచి పాత్ర ఉందని అన్నారట. దాంతో ఆమె షాక్ గురయ్యారట. పరిశ్రమలో ఇలాంటి మనుషులు ఉన్నారా? అని ఆమె వాపోయిందట. అలాంటి కామాంధులు పరిశ్రమలో చాలా మంది ఉన్నారని ఆమె అన్నారు. ఏ హై మొహబత్తిన్ సీరియల్ ద్వారా పాపులర్ అయిన దివ్యాంక ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హిందీ సీరియల్ నటుల్లో ఒకరు.