Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ కూడా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన నటన ప్రతిభను కూడా బయటికి తీసి అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు… ఇక ఇది ఏమైనా కూడా ఆయన ఒక స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. పుష్ప 2 సినిమాతో తనకంటూ ఒక సపరేట్ స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న ఈయన ప్రస్తుతం ఇండియన్ అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక అలాగే బాలీవుడ్ సెలబ్రిటీలను సైతం ఆయన మైమరిపింపజేస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక బాలీవుడ్ నటుడు అయిన ‘ముఖేష్ ఖన్నా’ రీసెంట్ గా ఈ సినిమాను చూసి దీని మీద ఆయన రివ్యూ తెలియజేశాడు… ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఇంతవరకు అల్లు అర్జున్ సినిమాలు చూడ లేదు కానీ ‘పుష్ప 2’ సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోయాను. దాని ద్వారా ఆయన గత చిత్రాలను కూడా చూడాలనిపిస్తుంది. అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు…ఇక పుష్ప 2 సినిమాలో పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు విజువల్ గా తెర మీద కనిపిస్తుంది. అలాగే ఒక దర్శకుడు యొక్క విజన్ కూడా మనకు ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలని చాలా కాన్ఫిడెంట్ గా తెరకెక్కించినప్పుడు ఆ సినిమాలో లాజిక్కులు అనేవి ప్రేక్షకుడు వెతకడు…తద్వారా సినిమా అనేది అల్టిమేట్ గా ముందుకు దూసుకెళ్తుంది సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. ఇక పుష్ప 2 సినిమా విషయంలో అదే జరుగుతుంది అంటూ ఆయన కొన్ని మాటలైతే మాట్లాడారు.
ఇక ఏది ఏమైనా కూడా బాలీవుడ్ దర్శక నిర్మాతలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలను దర్శకులను చూసి చాలా నేర్చుకోవాలి అంటూ ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశాడు. ఇక ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని చాలా రియలేస్టిక్ గా చూపించారు.
అదే బాలీవుడ్ లో అయితే దాన్ని చాలా అసభ్యకరంగా అశ్లీలమైన దృశ్యాలతో చూపించేవారు అంటూ ఆయన చెప్పడం విశేషం…ఇక ఆయన మాటలు కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు నచ్చనప్పటికి యావత్ ఇండియన్ సినిమా అభిమానులను మాత్రం ఆయన మాటలు చాలావరకు ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి…
మరి బాలీవుడ్ లో కూడా ఇకమీదట ఇలాంటి పర్ఫెక్షన్ తో సినిమాలను చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పైకెక్కించిన సినిమాల్లో పుష్ప 2 సినిమా మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…