Bollywood: జాతకాలు, వాస్తు…. ఇవన్నీ మూఢ నమ్మకాలని అభ్యుదయ వాదులు కొట్టిపారేస్తారు. కానీ సమాజంలో 99 శాతం మంది వీటిని నమ్ముతారు. అందుకు అనుగుణంగా తమ ఇళ్లు నిర్మించుకుంటారు. ఒక ఇంట్లోకి వెళ్ళాక కలిసి రాకపోతే వాస్తు సిద్ధాంతులను పిలిపిస్తారు. ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయా? అని చెక్ చేయిస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా వీటిని నమ్ముతారు. ఇదంతా ట్రాష్ అని `కొందరు కొట్టిపారేస్తారు. అయితే అందరి విషయంలో ఒకే సెంటిమెంట్ రిపీట్ అయితే నమ్మాలి అనిపిస్తుంది.
ముంబైలో ఉన్న ఓ ఖరీదైన బంగ్లాను కొన్న బాలీవుడ్ హీరోలు దివాళా తీశారట. ఆ ఇంట్లోకి వెళ్ళాక వాళ్లకు కలిసి రాలేదట. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారట. బాలీవుడ్ తొలితరం స్టార్స్ లో ఒకరైన భరత్ భూషణ్ ఎంతో ఇష్టపడి ఆ బంగ్లా కొన్నారట. ఇంట్లోకి వెళ్ళాక సమస్యలు మొదలయ్యాయట. ఆయనకు వరుస ప్లాప్స్ పడ్డాయట. ఎంత మంచి సబ్జక్ట్స్ ఎంచుకుని సినిమాలు చేసినా ఫలితం దక్కలేదట. స్టార్ గా ఉన్న భరత్ భూషణ్ జీరోకి వచ్చేశాడట.
ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయట. అప్పులపాలు అయ్యాడట. చివరకు ఆ ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందట. చాలా అందంగా ఉండే ఆ భవనం మీద మరో ఇద్దరు స్టార్స్ కూడా మనసు పడ్డారట. భరత్ భూషణ్ అమ్మేయడంతో హీరో రాజేంద్ర కుమార్ కొన్నారట. ఆయన కొన్నాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారట. ఆయనకు కూడా అదే పరిస్థితి ఎదురైందట. కలిసి రాలేదట. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
దాంతో రాజేంద్ర కుమార్ ఆ ఇంటిని అమ్మేశారట. తర్వాత ఆ బంగ్లా మరో స్టార్ హీరో రాజేష్ ఖన్నా చేతికి వెళ్లిందట. ఆయన ఇష్టపడి సొంతం చేసుకున్నారట. భరత్ భూషణ్, రాజేంద్ర కుమార్ మాదిరే.. రాజేష్ ఖన్నాకు కష్టాలు మొదలయ్యాయట. దాంతో ఆ బంగ్లా ఎవరికీ కలిసి రాలేదు. అందులో ఉంటే కెరీర్ నాశనం అనే పేరు పడిపోయిందట. రాజేష్ ఖన్నా సైతం అమ్మేశాడట. చివరికి ఓ వ్యాపారవేత్త దాన్ని కొనుగోలు చేశాడట. దాన్ని కూల్చి మరో భవనం నిర్మించాడట.