NTR Dragon movie: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్…కెజిఎఫ్ ఆయన కెరియర్ను మార్చేసిన సినిమా…ఆ మూవీ తర్వాత ప్రభాస్ తో చేసిన సలార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికోసమే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కి రకరకాల కండిషన్స్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తన లుక్కులో వేరియేషన్ ని చూపిస్తున్న ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కి మరికొన్ని కండిషన్స్ పెట్టాడట. తను ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం రహస్యంగా ఉంచుతున్నారు. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్ల గెటప్ ల కోసం ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే ఒక లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఇక మనకు కనిపించని మరొక లుక్కు కూడా ఉందట. దానికోసం మరొక మేకోవర్లో జూనియర్ ఎన్టీఆర్ ని మార్చాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తను అనుకున్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం తను ఏది చేయడానికైనా రెడీగా ఉన్నాడు. కానీ సక్సెస్ దక్కుతుందా? లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ ఎలివేషన్స్ తో ఉంటాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఆ ఎలివేషన్స్ లో నటిస్తూ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడా?
తద్వారా సినిమా ఇండస్ట్రీలోనే పలు రికార్డులను క్రియేట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కి ఎనలేని గుర్తింపును తీసుకొస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ఆంధ్రవాలా, అదుర్స్ లాంటి సినిమాల్లో నటించినప్పటికి అందులో అదుర్స్ సినిమా ఒక్కటే సక్సెస్ అయింది.
మరి ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యామియో పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ‘వార్ 2’ అనే సినిమా వచ్చింది.
ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ కోసమే హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి అతడు నిజంగా నటిస్తున్నాడా? లేదంటే కావాలనే సినిమా యూనిట్ ఇలాంటి న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది…