
బాలీవుడ్ ఇండస్ట్రీలో విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికీ వారు గ్రూపులుగా విడిపోతున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు ముందు వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా ఉన్నట్లు కన్పించేది. ఇటీవల సుశాంత్ ఆత్మహత్య.. నెపోటిటం.. డ్రగ్స్ లింకులు బయటపడటంతో సెలబ్రెటీలంతా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీంతో బాలీవుడ్లో రెండు చిలీపోయే ప్రమాదం ఏర్పడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సినీ సెలబ్రెటీలకు వారి నుంచే డ్రగ్స్?
బాలీవుడ్లో ఎప్పటి నుంచో గ్రూపులు ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఒక్కటిగా కన్పించారు. అయితే ఇటీవల బాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలతో ఇండస్ట్రీకి చేటు తెచ్చేలా కన్పిస్తున్నాయి. మీడియా సైతం బాలీవుడ్లోని కొందరు సెలబ్రెటీలను టార్గెట్ చేసేలా వార్తలు ప్రసారాలు చేస్తోంది. దీంతో కొందరు సెలబ్రెటీల మద్దతు ఇస్తుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇదంతా చూడటానికి కామన్ గా అనిపించినా బాలీవుడ్లో మాత్రం నివురుగప్పిన నిప్పులా మారుతోంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఐఎఎస్, డ్రగ్ మాఫియా సంబంధాలు ఉన్నాయని మీడియా ప్రముఖంగా ఫోకస్ చేస్తోంది. సినీ ప్రముఖులు రాజకీయాల్లో కూడా ఉండటంతో వారంతా కూడా ఇండస్ట్రీలో ఉన్నవారిని తప్పుబడుతున్నారు. ఎవరికీ వారు బాలీవుడ్ ఇండస్ట్రీపై బురదజల్లె ప్రయత్నం చేస్తుండటంతో ప్రజల్లో సినిమా వాళ్లపై ఓ రకమైన భావన ఏర్పడుతోంది. ఎప్పటి నుంచో బాలీవుడ్ ను శాసించాలని చూస్తున్న కొన్నిశక్తులు వీటిని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.
Also Read: ప్రభాస్.. ఎనిమిది అడుగులు, మూడు పాత్రలు !