
భారత ప్రధాని నరేంద్రమోడీ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా దేశ, విదేశీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, సహా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులంతా ప్రధాని నరేంద్రమోడీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వివాదాస్పద నటి కంగనా రౌనత్ ప్రత్యేకంగా మోడీకి విషెస్ తెలిపింది.
Also Read: సినీ సెలబ్రెటీలకు వారి నుంచే డ్రగ్స్?
కాగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ట్వీట్ చేసి మరీ ప్రధాని మోడీ రిప్లై ఇచ్చి కృతజ్ఞతలు తెలుపడం విశేషం.
రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ తో పాటు , అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , అరవింద్ కేజ్రీవాల్ , రాహుల్ గాంధీ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు . తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తో సహా దేశంలోని రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు విషెస్ తెలిపారు
Also Read: దేవుడా… కరోనా వ్యాక్సిన్ కోసం అప్పటివరకు ఎదురు చూడాలా…?
మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు సచిన్, విరాట్, సహా తాజా, మాజీ క్రికెటర్లు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. మోడీతో తాను ఆడేరోజుల్లో దిగిన ఫొటోను సచిన్ ట్వీట్ చేసి విషెస్ తెలిపారు. .
ఇక దేశాధినేతలు ట్రంప్, పుతిన్ సహా చాలా మంది మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు.