#OG Villain : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో రోజు రోజు కి అంచనాలను పెంచుకుంటూపోతున్న చిత్రం #OG. ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. రీసెంట్ గానే ఈ సినిమాలో అర్జున్ దాస్ మరియు శ్రీయ రెడ్డి నటిస్తున్నట్టుగా అధికారికం గా ప్రకటించింది మూవీ టీం.
ఇప్పుడు కాసేపటి క్రితమే ఈ చిత్రం లో మెయిన్ విలన్ గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో, ఒకప్పుడు యూత్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్టుగా టీం ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.మొదటి నుండే ఈ సినిమా పై భారీ లెవెల్ అంచనాలు ఉన్నాయి, ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ కూడా తోడు అవ్వడం తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకుంది.

గత కొద్దీ రోజుల నుండి మూవీ టీం ఇమ్రాన్ హష్మీ తో చర్చలు జరుపుతుంది. నిన్న డైరెక్టర్ సుజిత్ ఆయనని నేరుగా కలిసి స్క్రిప్ట్ మొత్తాన్ని వినిపించాడు.ఆయన క్యారక్టర్ ఎంతగానో నచ్చింది, వెంటనే గ్రీన్ సింగల్ ఇచ్చేసాడు. త్వరలోనే ఆయన షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ‘ఇమ్రాన్ హష్మీ’ సినిమాలను మనం చూసి ఉండకపోవచ్చు కానీ, పాపులర్ సాంగ్ ‘ఝలక్ దిగలాజ..ఏక్ బార్ ఆజా ఆజా’ తో ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసాడు.
అప్పట్లో ఈయన నటించిన ప్రతీ సినిమాకి యూత్ ఆడియన్స్ ఎగబడి మరీ వెళ్లేవారు, ఇంత క్రేజీ స్టార్ #OG చిత్రం లో నటించడం వల్ల ఆ సినిమాకి బాలీవుడ్ లో మంచి హైప్ వస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. నటుడిగా, సింగర్ గా మరియు మ్యూజిక్ కంపోజర్ గా సెన్సేషన్ సృష్టించిన ఇమ్రాన్ హష్మీ , ఇప్పుడు తనలోని నెగటివ్ యాంగిల్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో చూడాలి.