spot_img
Homeఎంటర్టైన్మెంట్Bollywood box office: బాలీవుడ్ లెక్కలన్నీ మారిపోయాయి... సీనియర్ హీరోలు సక్సెస్ కొట్టడం కష్టమేనా..?

Bollywood box office: బాలీవుడ్ లెక్కలన్నీ మారిపోయాయి… సీనియర్ హీరోలు సక్సెస్ కొట్టడం కష్టమేనా..?

Bollywood box office: గత కొద్ది సంవత్సరాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సరైన సక్సెసులైతే రావడం లేదు. ఇక రీసెంట్ గా ‘దురంధర్’, ‘దురంధర్ 2’ సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అయితే ఈ సినిమాలతో యంగ్ హీరో అయిన రన్వీర్ సింగ్ పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. బాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా పేరు సంపాదించుకున్న షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు మాత్రం ఇప్పటికి ఒక సక్సెస్ ని సాధించడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మాదే అని చెప్పుకోగలిగే ఈ ఖాన్ త్రయం ఇప్పుడు ఎందుకని సక్సెస్ లను సాధించడం లేదు. అలాగే ఒకప్పుడు సౌత్ సినిమా దర్శకులు వాళ్ళతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పటికి వాళ్లు మాత్రం చాలా రకాల కండిషన్స్ పెట్టి సౌత్ సినిమా దర్శకులతో సినిమాలు చేసేవారు కాదు.

అసలు సౌత్ సినిమాలను బాలీవుడ్ ఇండస్ట్రీకి రానిచ్చే వాళ్ళు కూడా కాదు. మరలాంటి ఈ హీరోలు ఇప్పుడు వాళ్ళ గర్వాన్ని తగ్గించుకొని మరి ఇతర హీరోల సినిమాలను పొగడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ల నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎలాగూ మెప్పించడం లేదు.

Also Read: ‘దురంధర్ 2’ మూవీ మీద ఖాన్ త్రయం సీరియస్ అవుతున్నారా..?

కాబట్టి చేసేదేమీ లేక ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక సతమతమవుతున్నారు… ఇక ఇప్పటికైనా వాళ్ళు మంచి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతే తప్ప మేము హీరోలం మేము ఏది చెప్తే అదే జరుగుతుంది అనే ఒక అహంకార పోకడతో ముందుకు సాగితే మాత్రం వాళ్ళ మార్కెట్ మరింత పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో చాలామంది హీరోలు టాప్ హీరోలుగా ఎదుగుతున్నారు. కాబట్టి ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరోలు సైతం చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ల ఐడెంటిటిని వాళ్ళు కాపాడుకుంటూ టాప్ రేంజ్ లో ముందుకు సాగాలి అంటే డిఫరెంట్ సినిమాలను ప్రయత్నించాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version