Urfi Javed: ప్రముఖ బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి తెలియని వారు ఉండరనే చెప్పాలి. సోషల్ మీడియా ను, బాలీవుడ్ మీడియా ను ఫాలో అయ్యే జనాలకు ఆమె బాగా సుపరిచితం. హిందీ పరిశ్రమలో హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న ఉర్ఫీ అదే స్థాయిలో అనేక కాంట్రవర్శీ లకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. అలాంటి ఉర్ఫీ కి తాజాగా ఒక చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్నే ఆమె స్వయంగా సోషల్ మీడియా లో పంచుకుంది.
తాజాగా ఈ హాట్ ముద్దుగుమ్మ ముంబై నుంచి గోవాకు విమానంలో వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి ఆమెను వేధించినట్లు తెలుస్తుంది. గురువారం రాత్రి విమానంలో గోవా వెళ్తుండగా ఎకానమీ క్లాస్ లో కూర్చున్న తర్వాత ఒక వ్యక్తి ఆమెను టీజ్ చేయటం మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన క్లిప్ ను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేస్తూ, తన ఆవేదనను వెల్లడించింది. తనను కొందరు ఈవ్ టీజింగ్ చేశారని వాపోయింది. టీజ్ చేస్తూ, పేర్లు పెట్టి పిలుస్తూ వేధించారని పేర్కొంది.
అయితే ఆ సమయంలో వారితో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదని, దీంతో వారి పక్కన ఉన్నవారికి ఈ విషయం పై అడిగితే తమ స్నేహితుడు మద్యం తాగి ఉన్నాడని అందుకే ఇలా చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఎంత తాగి ఉన్నా సరే ఇలా మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని క్షమించలేమని తన ఆగ్రహం వ్యక్తం చేసింది ఉర్ఫీ. అంతే కాకుండా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. తాను పబ్లిక్ ఫిగర్ నే కానీ పబ్లిక్ ప్రాపర్టీ ని మాత్రం కాదని తెగేసి చెప్పింది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంత ఘాటుగా మాట్లాడిన ఉర్ఫీ, కొన్ని సందర్భాల్లో అంతకు మించి ఘాటైన అందాలతో యువతను తన వైపు తిప్పుకోవడం లో ఘనాపాటీ అనే చెప్పాలి. తనదైన డ్రెస్సింగ్ స్టైల్ తో ఉర్ఫీ జావేద్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె పింక్ డ్రెస్ వేసుకొని ఫోజిచ్చిన ఫోటోలు ఆన్లైన్ లో హల్చల్ చేస్తుంది. క్లీవేజ్ షో చేయటంలో తనకు మించిన వాళ్ళు ఎవరు లేరనే విధంగా హాట్ హాట్ భంగిమల్లో రెచ్చిపోవడం ఉర్ఫీ కి అలవాటే..