Ranveer Singh: మన సౌత్ హీరోలంటే మొదటి నుండి నార్త్ ఇదని కి చెందిన సినీ ప్రముఖులకు చులకన భావం ఉండేది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తో పాటు, కన్నడ సినీ పరిశ్రమ కూడా వరల్డ్ వైడ్ గా బాలీవుడ్ సినిమాలకంటే ఎక్కువ గుర్తింపు ని సొంతం చేసుకుంటున్నాయి. ఇది బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న అవకాశం దొరికినా మన సౌత్ హీరోలను వెక్కిరించడం లో తక్కువ చేయడం లో అసలు వెనుకాడడం లేదు. రీసెంట్ గా ఒక అవార్డు ఫంక్షన్ లో ‘కాంతారా’ హీరో/ డైరెక్టర్ రిషబ్ శెట్టి(Rishab Shetty) ని వెక్కిరిస్తూ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) చేసిన వెక్కిలి చేష్టలు సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేత చివాట్లు పెట్టేలా చేస్తున్నాయి. రిషబ్ శెట్టి ఒకపక్క వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా రణవీర్ సింగ్ చేసిన ఓవర్ యాక్షన్ చూస్తే ఎవరికైనా రక్తం మరుగుతుంది.
కాంతారా చిత్రాన్ని శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వరాహ అవతారాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం. క్లైమాక్స్ లో విలన్స్ ని చంపే ముందు హీరో రిషబ్ శెట్టి లోకి కాంతారా దేవుడు వస్తాడు. ఆ తర్వాత లేడీ విలన్ ని చంపడం కోసం చాముండి దేవత హీరో శరీరం లోకి ఆవహిస్తుంది. దేవత అయినా చాముండి ని దెయ్యం తో పోలుస్తూ, స్టేజి మీద రణవీర్ సింగ్ చేసిన వికృత వేషాలకు సంబంధించిన వీడియో లు చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ భగ్గుమన్నారు. ఇలాంటి చీప్ వేషాలు వేస్తాడు కాబట్టే, మన తెలుగు నిర్మాతలు ఇతనికి అడ్వాన్స్ ఇచ్చి కూడా సినిమాలను రద్దు చేస్తున్నారు అంటూ పెదవి విరిచారు. అయితే సోషల్ మీడియా నుండి ఎదురు అవుతున్న ఈ నెగిటివిటీ ని గమనించిన రణవీర్ సింగ్ నేడు క్షమాపణలు చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఎంత అద్భుతంగా నటించాడో చెప్పాలి అనేదే నా ముఖ్యమైన ఉద్దేశ్యం. ముఖ్యంగా ఆ సన్నివేశం లో ఆయన ఎలా చేసాడో అనుకరించి చూపించాలని అనుకున్నాను. మన దేశం లో ఉన్న ప్రతీ సంస్కృతి , సంప్రదాయాలను గౌరవించే వారిలో నేను ముందు వరుస లో ఉంటాను. ఎవరి మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశ్యం నాకు లేదు. ఒకవేళ నా వల్ల తెలియకుండా ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తిని ఉండుంటే దయచేసి నన్ను క్షమించండి’ అంటూ చెప్పుకొచ్చాడు రణవీర్ సింగ్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రణవీర్ సింగ్ పెళ్లాడిన దీపికా పదుకొనే కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి. తన భార్య రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి ని ఇలా అవహేళన చేయాలనే ఆలోచన రణవీర్ సింగ్ కి ఎలా వచ్చిందో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.