https://oktelugu.com/

Vettiyan Movie In OTT : రజినీకాంత్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా ‘వెట్టియాన్’..అనుకున్న తేదీ కంటే ముందుగానే ఓటీటీలోకి..ఎందులో చూడాలంటే!

ఈ సినిమాకి సంబంధించిన అన్ని బాషల డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఈ సినిమాని 50 రోజుల తర్వాతనే విడుదల చేయాలి. కానీ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రన్ రాకపోవడంతో నాలుగు వారాల్లోపే విడుదల చేసుకునే అవకాశం ఇవ్వాలని మేకర్స్ ని రిక్వెస్ట్ చేసుకున్నారు అమెజాన్ ప్రైమ్ సంస్థ.

Written By:
  • Vicky
  • , Updated On : October 21, 2024 / 08:46 PM IST

    Vettiyan Movie In OTT

    Follow us on

    Vettiyan Movie In OTT :  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కేవలం కొన్ని వర్గక ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని తీసిన సినిమా కావడంతో రజినీకాంత్ రేంజ్ వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. డైరెక్టర్ జ్ఞాన్ వేల్ రాజా సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. రజినీకాంత్ ఈ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగానే తీసాడు కానీ, సెకండ్ హాఫ్ లో రజినీకాంత్ మార్క్ హీరోయిజం ని జత చేయడం వర్కౌట్ కాకపోవడంతో పెద్ద రేంజ్ వసూళ్లను రాబట్టలేకపోయింది.

    ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలకు కలిపి 234 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కనీసం 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాల్సి ఉంది. ఈ దీపావళి వరకు రన్ ఉండే అవకాశం ఉండడం తో మరో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 17 కోట్ల రూపాయలకు జరిగింది. 11 రోజులకు గాను ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఫుల్ రన్ లో రెండు కోట్ల రూపాయిలు అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా తెలుగు లో కూడా ఫ్లాప్ చిత్రం గా మిగిలే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ముందు విడుదలైన రజినీకాంత్ ‘లాల్ సలాం’ చిత్రం కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేదు, ఆ చిత్రం తో పోలిస్తే ‘వెట్టియాన్’ తమిళ టైటిల్ ని తెలుగులో పెట్టినప్పటికీ ఆడియన్స్ బాగానే ఆదరించారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన అన్ని బాషల డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఈ సినిమాని 50 రోజుల తర్వాతనే విడుదల చేయాలి. కానీ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రన్ రాకపోవడంతో నాలుగు వారాల్లోపే విడుదల చేసుకునే అవకాశం ఇవ్వాలని మేకర్స్ ని రిక్వెస్ట్ చేసుకున్నారు అమెజాన్ ప్రైమ్ సంస్థ. దీనికి మేకర్స్ కూడా అంగీకరించడం తో ఈ చిత్రం నవంబర్ 7 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ని తెలియచేయబోతున్నారు మేకర్స్. థియేటర్స్ లో అంతంత మాత్రం రన్ ని రాబట్టుకున్న ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్ ని ఎంతమేరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి.