కరోనా ఎఫెక్ట్ తో చాలా సినిమాల అంచనాలు తారుమారు అవుతున్నాయి ముఖ్యగా నటీనటుల కాల్ షీట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఏర్పడు తున్నాయి. ఆ క్రమంలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ‘పుష్ప’ కూడా ప్రాబ్లమ్స్ పేస్ చేస్తోంది. నిజానికి `పుష్ప` సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈపాటికే స్టార్ట్ కావాలి . కానీ ఈ సినిమాలో నటించాల్సిన విజయ్ సేతుపతి కాల్ షీట్స్ విషయం లో చిన్న మెలిక పెట్టాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ” పుష్ప ” చిత్రంలో నేను ఖచ్చితంగా విలన్ పాత్రలో నటిస్తాను గాని ఈ సినిమా తమిళ వెర్షన్ లో మాత్రం నేను విలన్ గా ఉండను. నాకు తమిళ నాట ఉన్న హీరో ఫాలోయింగ్ కి ప్రోబ్లం వస్తుంది అని చెప్పాడట ..దాంతో సుకుమార్ టీం వేరే నటుడి కోసం అన్వేషణ మొదలెట్టారు .
ఆ క్రమంలో ` భైరవ గీత ` ఫేమ్ కన్నడ నటుడు ధనంజయను విజయ్ సేతుపతి స్తానం లో తీసుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ధనంజయను సంప్రదించింది విలన్ విజయ్ సేతుపతి కి ప్రత్యమ్నాయం గా కాదు. సినిమాలో మరో ముఖ్య పాత్రకు…దర్శకుడు సుకుమార్ మెయిన్ విలన్ పాత్రకు విజయ్ సేతుపతి స్థానంలో బాబీ సింహా లేదా అరవింద్ స్వామిని తీసుకోవాలని అనుకొంటున్నాడు. కానీ అరవింద్ స్వామి బిజీ ఆర్టిస్టే కావడం తో పారితోషకం చాలా ఎక్కువ అడుగు తున్నాడట..ఆ క్రమంలో దర్శకుడు సుకుమార్ బాబీ సింహా వైపే మొగ్గు చూపుతున్నాడు. బాబీ సింహ టాలెంట్ ఏమిటో ‘జిగర్ తాండా ` సినిమాలో సుకుమార్ చూసి ఉండటం తో మెయిన్ విలన్ పాత్ర అతనికే ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. పుట్టుకతో తెలుగు వాడైన బాబీ సింహ ‘పుష్ప’లో నటించడానికి అమితాసక్తితో ఉన్నాడట .పైగా . పారితోషకం గురించి అసలు పట్టించుకోవం లేదని, ఎన్ని కాల్ షీట్స్ కావాలంటే అన్ని ఇవ్వడానికి కూడా రెడీ అని..అంటున్నాడట …జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు తీసుకొన్న బాబీ సింహ మొత్తానికి మాతృ భాషలో మంచి ఛాన్స్ దక్కించు కొన్నాడు.