Chiranjeevi Bobby Movie Updates: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో కొత్త సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాతో బాబీ మరోసారి చిరంజీవిని మాస్ అవతారంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారట…ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది. మరోసారి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ ప్రయోగం బ్లాక్ బస్ట్ హిట్ ఇస్తుందంటూ మెగా అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఇకమీదట చేయబోయే సినిమాలన్నీ కూడా సక్సెస్ ఫార్ములాని నమ్ముకునే ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి విజయాలు సాధించినా కూడా మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ను టచ్ చేసే విజయాలైతే రాలేకపోతున్నాయి.
ఇక అతనికి భారీ మాస్ ఎలివేషన్స్ ఇస్తూ సినిమా వస్తే ఆ. మూవీ ఈజీగా 500 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందనే నమ్మకంతో మెగా అభిమానులైతే ఉన్నారు. ఇక దానికి తగ్గట్టుగానే బాబీ తెరకెక్కించబోయే ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ను కొల్లగొట్టబోతుంది అనేదే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది…
బాబీ లాంటి దర్శకుడు కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా మాస్ సినిమాలను నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి అతను కమర్షియల్ సినిమాలను చేయడంలో సిద్ధహస్తుడనే చెప్పాలి. మరలాంటి బాబీ ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమా విషయంలో కూడా మరోసారి ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు…
ఇంతకుముందు ఎన్నడు చూడని చిరంజీవిని ఈ సినిమాలో చూపించబోతున్నారట… ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి… మే నెలలో చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని మూటగట్టుకుంటుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.విశ్వంభర s సూపర్ సక్సెస్ ని సాధిస్తే బాబీ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…