Homeఎంటర్టైన్మెంట్Bobby-Chiranjeevi Movie : డైరెక్టర్ బాబీకి చిరంజీవి విలువైన బహుమతి, ధర తెలిస్తే మైండ్ బ్లాక్

Bobby-Chiranjeevi Movie : డైరెక్టర్ బాబీకి చిరంజీవి విలువైన బహుమతి, ధర తెలిస్తే మైండ్ బ్లాక్

Bobby-Chiranjeevi Movie : మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరయ్య రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. 2023 సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య విడుదలైంది. ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కింది. చిరంజీవిలోని ఊరమాస్ యాంగిల్ ని చాలా ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేశాడు బాబీ. చిరంజీవి కెరీర్లో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది వాల్తేరు వీరయ్య. వరల్డ్ వైడ్ ఈ మూవీ రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటించింది. రవితేజ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేయడం మరొక విశేషం.

ఈ క్రమంలో బాబీపై తనకున్న ప్రేమను చాటుకున్నారు చిరంజీవి. ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే విలువైన బహుమతి అందించారు. బాబీకి చిరంజీవి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు. స్వయంగా బాబీ చేతికి ఆ వాచ్ ధరింపజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒమేగా సీమాస్టర్ డైవర్ 300 M మోడల్ కి చెందిన ఆ వాచ్ ధర రూ.4.88 లక్షలు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు బాబీ. తన ఆనందాన్ని సోషల్ మీడియా పోస్ట్ లో వెల్లడించారు.

Also Read : మెగాస్టార్ సినిమాలో పవర్‌స్టార్… తగ్గేదే లే అంటున్న అభిమానులు

బాస్ నుండి బ్యూటిఫుల్ మెగా సర్ప్రైజ్. వెలకట్టలేని ఈ బహుమతికి కృతజ్ఞతలు ప్రియమైన చిరంజీవి గారు. మీ ప్రేమ, ప్రోత్సాహం, దీవెనలే నాకు ప్రపంచం అన్నయ్య. ఈ క్షణాలను జీవితాంతం గుర్తించుకుంటాను… అని బాబీ కామెంట్ చేశారు. చిరంజీవితో దిగిన ఫోటోలు షేర్ చేశాడు. కాగా బాబీ-చిరంజీవి కాంబో మరోసారి సెట్ అయ్యింది. చిరంజీవికి బాబీ కథ వినిపించారు. ఆయనకు నచ్చడంతో ఓకే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనిలో బాబీ బిజీ అయ్యాడు.

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, అనిల్ రావిపూడి చిత్రాల్లో నటిస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ ఏడాది థియేటర్స్ లోకి రానుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విశ్వంభర సోషియో ఫాంటసీ జోనర్లో భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి మూవీ ఇటీవల సెట్స్ పైకి వెళ్ళింది. 2026 జనవరికి విడుదల కానుంది. చిరంజీవికి జంటగా నయనతార నటిస్తుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో కూడా చిరంజీవి ఒక మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular