https://oktelugu.com/

Pushpa: పుష్ప’ అభిమానులకు చేదు వార్త..తెలుగులో ఇక రిలీజ్ లేనట్టేనా..? చివరి నిమిషంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత!

పూర్తి వివరాల్లోకి వెళ్తే, 'పుష్ప 2' విడుదలకు ముందు, 'పుష్ప 1' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో ఈ నెల 22వ తారీఖున విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.

Written By: Vicky, Updated On : November 20, 2024 4:43 pm
Pushpa 2

Pushpa 2

Follow us on

Pushpa: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప 2 : రూల్’ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ అభిమానుల్లో ఉన్న వైల్డ్ ఫైర్ ని చెలరేగేలా చేసింది. యూట్యూబ్ లో రికార్డుల వర్షం కురిపిస్తూ అత్యధిక వ్యూస్ తో ట్రైలర్ దూసుకుపోతుంది. ఈ ట్రైలర్ గురించి ప్రముఖ సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియా లో కామెంట్ చేయడం, ఈ సినిమా పట్ల వాళ్లకు ఉన్న అమితాసక్తిని బయటపెట్టడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 2 మేనియా నే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి ప్రచారం అవుతున్న ఒక వార్త అభిమానులకు కాస్త నిరాశని కలిగిస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, ‘పుష్ప 2’ విడుదలకు ముందు, ‘పుష్ప 1’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో ఈ నెల 22వ తారీఖున విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. హాలీవుడ్ లో సీక్వెల్స్ విడుదలయ్యే ముందు, పార్ట్ 1 రీ రిలీజ్ చేయడం వంటివి చాలా కాలం నుండి జరుగుతూనే ఉంది. అవతార్ చిత్రానికి కూడా ఇలాగే చేసారు. ఇప్పుడు ‘పుష్ప 2’ కి కూడా అదే ఫార్మటుని అనుసరిస్తున్నారు మేకర్స్. అయితే ‘పుష్ప 1’ చిత్రాన్ని తెలుగు లో అభిమానులు వీక్షించేందుకు సిద్దమే. కానీ తెలుగు లో ఈ చిత్రాన్ని విడుదల చేయట్లేదట. కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే విడుదల చేస్తున్నారట. ఇదే ఇప్పుడు అభిమానులను తీవ్రమైన అసహనం కి గురి చేస్తుంది.

‘పుష్ప 2’ థియేట్రికల్ ట్రైలర్ ని బాగా గమనిస్తే, సుకుమార్ తెలుగు ఆడియన్స్ కంటే ఎక్కువగా హిందీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసినట్టుగా అనిపించింది. అనేక మందికి ఇదేంటి భోజ్ పూరీ సినిమా లాగా ఉంది అనే ఫీలింగ్ కూడా కల్పించింది ఈ థియేట్రికల్ ట్రైలర్. తెలుగు లో ఎలాగో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. కేవలం యావరేజ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ మోత మోగిపోతాది. కానీ హిందీ ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించాలంటే ట్రైలర్ కట్ ఆ మాత్రం ఉండాలని, అందుకే అలా కట్ చేసారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా చెప్పిన సమయానికి థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే భయం అభిమానుల్లో నెలకొంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఒక పాట చిత్రీకరణ కూడా బ్యాలన్స్ ఉంది. ఈపాటికి ప్రొమోషన్స్ లో బిజీ గా ఉండాల్సిన టీం, షూటింగ్ లో బిజీ గా ఉన్నారంటే డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ చెక్కుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.