Bimbisara Collections: బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది. ఇప్పటికే విపరీతమైన లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇంకా భారీ కలెక్షన్స్ ను రాబడుతుండటం విశేషం. మొత్తానికి ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అసలు ఈ సినిమా ఈ స్థాయి హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కత్తి పట్టుకుని చేసిన విన్యాసాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అలాగే సినిమాలోని బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో, బాక్సాఫీస్ దగ్గర బింబిసార తన ఏక ఛాత్రాధిపత్యాన్ని పరిపూర్ణంగా ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో వారం కూడా తెలుగు రాష్ట్రాలలో 12 లక్షల దాకా షేర్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 14 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టింది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అసలు నిర్మాతకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి ? చూద్దాం రండి.
ముందుగా ‘బింబిసార’ సినిమా 3 వీక్స్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 10.13 కోట్లు
సీడెడ్ 6.79 కోట్లు
ఉత్తరాంధ్ర 4.29 కోట్లు
ఈస్ట్ 2.04 కోట్లు
వెస్ట్ 1.73 కోట్లు
గుంటూరు 2.45 కోట్లు
కృష్ణా 1.91 కోట్లు
నెల్లూరు 1.17 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 3 వీక్స్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 29.19 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 58.38 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.22 కోట్లు
ఓవర్సీస్ 2.57 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 3 వీక్స్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 34.79 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 69:53 కోట్లను కొల్లగొట్టింది
‘బింబిసార’ చిత్రానికి రూ.20.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలను సాధించింది. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ ఇప్పుడు ఈ సినిమా కోసం కనిపిస్తోంది. అదే ‘బింబిసార’ కు బాగా ప్లస్ అయ్యింది. మొత్తానికి బింబిసార చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. ఇపుడున్న అంచనాల ప్రకారం అన్నీ రైట్స్ కలుపుకుని ఈ సినిమాకి దాదాపు 45 కోట్లు లాభం వచ్చే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తోంది.
Also Read:NTR Fights Tiger: ఆర్ఆర్ఆర్: పులితో ఎన్టీఆర్ పోరాటం.. ఎలా తీశారో మేకింగ్ వీడియో వైరల్