Ram Gopal Varma: ఒకప్పుడు ఎన్నో సంచలనాత్మక చిత్రాలను చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ, ఇటీవల కాలంలో ఎంతగా దిగజారిపోయాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. బూతు సినిమాలు, వివాదాస్పద సినిమాలకే ఆయన తన కెరీర్ ని అప్పగించాడు. అయితే రీసెంట్ గానే ఆయన సత్య సినిమాని మరోసారి చూసి, ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసేవాడిని, ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాను, నా మీద నాకే సిగ్గు వస్తుంది, ఇప్పుడు అంతటి గొప్ప సినిమాలు నేను తీయకపోవచ్చు, కానీ నా ఇమేజి ని పెంచే సినిమాలు మాత్రమే చేయాలనీ అనుకుంటున్నాను అంటూ ఆయన పెట్టిన ఒక ట్వీట్ తెగ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ వేసిన కాసేపటికే ఆయన ‘సిండికేట్’ అనే చిత్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్టు ప్రకటించాడు. ఈ చిత్రాన్ని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించబోతున్నాడట. ఇందులో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కి సంబంధించిన బడా సూపర్ స్టార్స్ నటిస్తారని టాక్.
ఇప్పటికే ప్రముఖ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ని డేట్స్ అడిగాడట రామ్ గోపాల్ వర్మ. కథ బాగా నచ్చడంతో వెంకటేష్ కూడా డేట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘క్షణ క్షణం’ అనే చిత్రం తెరకెక్కింది. ఆ రోజుల్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ అయినప్పుడు అద్భుతమైన రేటింగ్స్ వస్తుంటాయి. ఈ చిత్రం తర్వాత ఎందుకో మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. అదే విధంగా ‘సిండికేట్’ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నాయించబోతున్నాడట. అమితాబ్ బచ్చన్ తో గతం లో రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్’, ‘సర్కార్ 2 ‘ వంటి చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లో అప్పట్లో ఒక సెన్సేషన్.
అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్స్ కి గుడ్ బై చెప్పి కేవెలం క్యారక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన ఆరోజుల్లో, మళ్ళీ ఆయన్ని లీడ్ రోల్ లో పెట్టి సినిమాని తీసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు. ఆ తర్వాత కూడా వీళ్ళ కాంబినేషన్ లో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ అవి పెద్దగా ఆడలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు వీళ్ళ కలయిక లో కుదిరింది. ఇక సిండికేట్ లో నటించబోతున్న మరో సౌత్ స్టార్ విజయ్ సేతుపతి. హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా విజయ్ సేతుపతి మన సౌత్ ఆడియన్స్ లో దక్కించుకున్న క్రేజ్ మామూలుది కాదు. అలాంటి ఆర్టిస్ట్ ఈ చిత్రం లో చేయబోతుండడం గమనార్హం. ఇలా మంచి కంటెంట్ ఉన్న సూపర్ స్టార్స్ తో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఈ చిత్రం మళ్ళీ ఆయన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుండగా లేదా అనేది చూడాలి.