Rajamouli: ఇప్పుడు రాజమౌళికి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ అదే !

Rajamouli: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అనగా విడుదల వాయిదా పడింది. మరి మళ్ళీ ఎప్పుడు విడుదల ? ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి ? ఒకవేళ చెప్పినా ఎవ్వరూ నమ్మలేని స్థితి. ఎందుకంటే.. ఇప్పటికే ఎన్నో సార్లు ఆర్ఆర్ఆర్ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే, స్వయంగా రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరో కొత్త రిలీజ్ డేట్ అంటూ ఎనౌన్స్ […]

Written By: Shiva, Updated On : January 5, 2022 12:24 pm
Follow us on

Rajamouli: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అనగా విడుదల వాయిదా పడింది. మరి మళ్ళీ ఎప్పుడు విడుదల ? ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి ? ఒకవేళ చెప్పినా ఎవ్వరూ నమ్మలేని స్థితి. ఎందుకంటే.. ఇప్పటికే ఎన్నో సార్లు ఆర్ఆర్ఆర్ వాయిదా వేయాల్సి వచ్చింది.

Rajamouli

అందుకే, స్వయంగా రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరో కొత్త రిలీజ్ డేట్ అంటూ ఎనౌన్స్ చేసినా నమ్మే అవకాశం తక్కువ. కానీ, సినిమా రిలీజ్ కి రెండు నెలలు ముందే కొత్త డేట్ ఫిక్స్ చేయాలి. అలా చేస్తే, జనం నమ్ముతారా ? ఇప్పటికే విసిగిపోయిన జనం.. ఈ సారి రిలీజ్ డేట్ కే ఖఛ్చితంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుందని గుడ్డిగా నమ్ముతారా ? నమ్మకపోతే.. నమ్మించేది ఎలా ? ఇదే ఇప్పుడు రాజమౌళికి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్.

వాస్తవానికి రాజమౌళి జనవరి 7 నుంచి ఆర్ఆర్ఆర్ ని వాయిదా వెయ్యాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. కరోనా మూడో వేవ్ కారణంగా సినిమాని పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. థర్డ్ వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.

Also Read: అనుకున్నట్టే అయిన “రాధే శ్యామ్” రిలీజ్… నిరాశలో అభిమానులు ?

కాబట్టి, థియేటర్స్ ను క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్ రెడీ కరోనా న్యూ వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే నివారణ చర్యలు కూడా చేపట్టాయి. ఢిల్లీలో పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ థియేటర్స్, స్కూల్స్ మూసివేశారు. కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో సైతం కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అక్కడ నైట్ కర్ఫ్యూ అమలవుతుంది.

మొత్తానికి నార్త్ ఇండియాలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. రానున్న వారంలో థియేటర్స్ క్లోజ్ పై ప్రభుత్వాలు కూడా కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే భారీ సినిమాలు పోస్ట్ ఫోన్ అవ్వక తప్పడం లేదు.

Also Read: హీరోయిన్ కొత్త కాపురం లోని మధురానుభూతులు వైరల్ !

Tags