https://oktelugu.com/

Bigg Boss Telugu : అరుదైన వ్యాధితో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బిగ్ బాస్ విన్నర్, ఊళ్లు పట్టుకుని తిరుగుతున్న అభిజీత్!

బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని సమాచారం. ఆయన ప్రపంచ యాత్రికుడిగా మారిపోయాడు. చూడగానే నచ్చేసే హోమ్లీ బాయ్ అభిజీత్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. మరి ఆ కథేమిటో చూడండి.

Written By: , Updated On : November 30, 2024 / 09:11 AM IST
Abhijeet
Follow us on

Bigg Boss Telugu : హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు అభిజీత్. నటనపై మక్కువతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్తవాళ్లతో యూత్ఫుల్ స్టోరీస్ చేస్తుంటారు. ఆయన తెరకెక్కించిన హ్యాపీ డేస్ బ్లాక్ బస్టర్ హిట్. ఇదే తరహాలో ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రం చేశాడు. ఈ మూవీలో హీరోగా అభిజీత్ ఎంపికయ్యాడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ బాగుంటుంది. కానీ హ్యాపీ డేస్ రేంజ్ లో ఆడలేదు. జస్ట్ పర్లేదు అనిపించుకుంది. అనంతరం అభిజీత్… రామ్ లీల, మిర్చిలాంటి కుర్రోడు.. చిత్రాల్లో హీరోగా నటించాడు. బ్రేక్ రాలేదు.

దాంతో గ్యాప్ వచ్చింది. సడన్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ప్రత్యక్షం అయ్యాడు. కరోనా సమయంలో ఈ సీజన్ ప్రసారమైంది. షోకి ఎంపికైన సెలెబ్స్ ని రెండు వారాల ముందే కొరెంటైన్ కి పంపారు. కఠిన నిబంధనల నేపథ్యంలో పేరున్న నటులు ఈ సీజన్లో పాల్గొనలేదు. అప్పటికి పరిచయం లేని కొత్త ముఖాలు దర్శనం ఇచ్చాయి. అభిజీత్ తో పాటు ఒకరిద్దరు ప్రేక్షకులకు తెలిసిన కంటెస్టెంట్.

అభిజీత్ ఫిజికల్ టాస్క్ లలో వెనుకబడేవాడు. అయితే మైండ్ గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మోనాల్ గజ్జర్ ని లైన్లో పెట్టాలని బాగా ట్రై చేశాడు. కానీ అఖిల్ సార్థక్ కి ఆమె కనెక్ట్ అయ్యింది. దాంతో యూట్యూబర్ హారికతో సన్నిహితంగా ఉండేవాడు. వీరిద్దరికీ కామన్ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. బయట హారిక, అభిజీత్ కలిసి ఇంటర్వ్యూలలో పాల్గొనడం, వారు ఓకే అంటే పెళ్లి చేస్తామని చెప్పడం కూడా అయ్యింది. సీజన్ 4 టైటిల్ విన్నర్ గా నిలిచిన అభిజీత్.. అనంతరం హారికను ఒక చెల్లిగా చూశానని చెప్పి షాక్ ఇచ్చాడు.

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడంతో ఇండస్ట్రీలో అభిజీత్ నిలదొక్కుకుంటాడని అందరు భావించారు. కానీ అలా జరగలేదు. రెండు వెబ్ సిరీస్లలో మాత్రమే అభిజీత్ కి అవకాశం వచ్చింది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి చేసిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ వాటిలో ఒకటి. అలాగే మోడరన్ లవ్ హైదరాబాద్ పేరుతో ఒక యాంథాలజీ సిరీస్ చేశాడు.

కాగా అభిజీత్ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడట. అందుకే ఆయన ట్రావెలర్ గా మారిపోయాడట. ఇండస్ట్రీని కూడా వదిలేసిన అభిజీత్.. ప్రపంచంలోని తనకు ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. సాహసాలు చేస్తున్నాడు. అభిజీత్ లుక్ చాలా మారిపోయింది.