Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఎనిమిది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ రంజుగా సాగుతుంది. అయితే నిన్న నామినేషన్స్ లో తేజ హైలైట్ గా నిలిచాడు.తేజ ఎవరిని నామినేట్ చేస్తాడా అని కంటెస్టెంట్స్ భయపడ్డారు. ఇందుకు కారణం ఏంటంటే .. తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్క రెండో వారం తప్ప మిగిలిన అన్ని వారాల్లో తేజ నామినేట్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్య పరిచే అంశం.
ఇది ఎవరు గుర్తించలేదు. కానీ వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున సందీప్ ఎలిమినేట్ కావడంతో ఈ విషయం తెలిపారు. గత మూడు వారాల నుంచి నువ్వు ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లే ఎలిమినేట్ అవుతున్నారు అని అన్నారు. కానీ గత మూడు వారాలు కాదు ముందు నుంచి ఇలానే జరుగుతుంది. దీన్ని ఎవరు గమనించలేదు. తేజ మొదటి వారం కిరణ్ రాథోడ్ ని నామినేట్ చేశాడు. ఆమె ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక రెండో వారం ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. ప్రశాంత్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు.
మూడో వారం దామిని నామినేట్ చేశాడు తేజ. నాలుగో వారం రతిక ని .. ఐదో వారం శుభ శ్రీ ని తేజ నామినేట్ చేశాడు. వాళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. కాగా ఆరో వారం నయని ని నామినేట్ చేశాడు తేజ. ఆమె కూడా హౌస్ కి గుడ్ బై చెప్పింది. ఏడో వారం పూజ మూర్తి ని నామినేట్ చేయగా ఆమె కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఎనిమిదో వారం సందీప్ విషయం లోను ఇలాగే జరిగింది.
నాగార్జున తేజ నామినేట్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పడంతో ఈ విషయం బాగా హైలైట్ అయింది. అయితే తేజ ఈ వారం అర్జున్ ఇంకా రతికాని నామినేట్ చేశాడు. ఈ వారం మరి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారో లేక మరొకరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.